Big Stories

Leopard: చిరుత పులి మళ్లీ వచ్చింది.. భయాందోళనలో మహానంది ప్రజలు

Leopard in Kurnool district: ఉమ్మడి కర్నూల్ జిల్లాలో చిరుత పులి మళ్లీ ప్రత్యక్షమైంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మహానంది పరిసర ప్రాంతాల్లో చిరుత పులి సంచరించడంతో ఆ ప్రాంత ప్రజలు భయంతో వణికిపోతున్నారు. మహానందిలోని గోశాలలో చిరుతపులి రావడంతో భక్తులు గమనించి అధికారులకు సమాచారం అందించారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

- Advertisement -

కాగా, ఇటీవల మహానంది ఆలయ పరిసర ప్రాంతంలో నాలుగు రోజుల క్రితం చిరుతపులి సంచారాన్ని గమనించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు ఫోన్ చేసి చెప్పగా.. అధికారులు చిరుత జాడలను గుర్తించి చిరుతపులి సంచారం నిజమేనని నిర్ధారించారు.

- Advertisement -

చిరుత పులి మహానంది క్షేత్రంలోని పరిసర ప్రాంతంలోనే తిరుగుతుంది. అయితే చిరుతపులి అక్కడ సంచరిస్తున్నట్లు ట్రాప్ కెమెరాల్లో విజువల్స్ రికార్డ్ అయ్యాయి. గోశాల వద్దకు చిరుత వచ్చి సంచరిస్తున్నట్లు అందులో స్పష్టంగా కనిపించిందని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. అక్కడే కాసేపు తిరగడం కెమెరాల్లో రికార్డు అయింది. దీంతో అధికారులు అలర్ట్ చేశారు.

మహానంది పరిసర ప్రాంతాల్లోని ప్రజలు ఎవరూ పెంపుడు జంతువులను బయటకు వదలొద్దని అటవీ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అలాగు మహానంది పుణ్యక్షేత్రంలో రాత్రి సమయాల్లో భక్తులు ఆరుబయట నిద్రించొద్దని మైకుల్లో అలర్ట్ చేశారు. గత నాలుగు రోజుల క్రితం కనిపించిన చిరుత.. మళ్లీ ప్రత్యక్షం కావడంతో భక్తుల్లో ఆందోళన నెలకొంది. కాగా, చిరుత సంచారంతో మహానందికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతోంది.

చిరుతపులిని మహానందిలోనే సంచరిస్తుందని, ఎలాగైనా పట్టుకోవాలని అధికారులు అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే చిరుత పులిని పట్టుకునేందుకు బోన్లు, కెమెరాలను ఏర్పాటు చేశారు.

Also Read: ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలను నోటిఫై చేస్తూ సీఆర్డీఏ గెజిట్

అదేవిధంగా నంద్యాల, గిద్దలూరు పరిసర ప్రాంతాల్లో చిరుత పులి భయభ్రాంతులకు గురిచేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 25న కట్టెల కోసం అడవిలోకి వెళ్లిన పచ్చర గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ షేక్ మెహరున్నీషాపై దాడి చేసి చిరుత పులి హతమార్చింది. ఈ ఘటనతో పచ్చర గ్రామస్తులు ఉలిక్కి పడ్డారు. తర్వాత నల్లమల్ల అటవీ ప్రాంతంలోని పచ్చర్ల చెక్ పోస్టు పరిసర ప్రాంతాల్లో బోన్లు, ట్రాప్ కెమెరాలను అమర్చడంతో చిరుత చిక్కింది.

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News