Big Stories

Kodali Nani: వైసీపీ శ్రేణులపై జరుగుతున్న దాడులకు వారే సూత్రదారులు: కొడాలి నాని

Kodali Nani: ఏపీలో వైసీపీ శ్రేణులపై దాడులకు పాల్పడుతున్న వారిపై, పోలీసులపై హైకోర్టులో కేసు వేయనున్నట్లు మాజీ మంత్రి కొడాలి నాని వెల్లడించారు. శనివారం కృష్ణా జిల్లాలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఎన్నికల ఫలితాల అనంతరం టీడీపీ, జనసేన నాయకులు ఉద్దేశపూర్వకంగానే వైసీపీ శ్రేణులపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

- Advertisement -

అర్థరాత్రి ఇళ్లకు వెళ్లి ఆస్తులు ధ్వంసం చేయడంతో పాటు.. వ్యక్తులపై కూడా దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ పార్టీని అణచివేసేందుకు దాడులకు తెగబడుతున్నారని పేర్కొన్నారు. వ్యక్తిగతంగా దాడులకు పాల్పడుతూ గ్రామాల్లో వైసీపీ శ్రేణులు ఉండకూడదని హెచ్చరిస్తున్నారని అన్నారు. అల్లరి మూకలు దాడులకు పాల్పడుతుంటే పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని విమర్శించారు.

- Advertisement -

టీడీపీ అల్లరి మూకల దాడల వీడియోలు, సీసీ ఫుటేజీలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. లోకల్ స్టేషన్‌లో ముందస్తుగా ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు రక్షణ కల్పించకపోగా.. కనీసం దాడులకు పాల్పడ్డ వ్యక్తులపై ఫిర్యాదు చేస్తే కేసులు నమోదు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే వైసీపీ  తరుపున హైకోర్టులో ప్రయివేట్ కేసులు వేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఎలాంటి భయాందోళనలకు గురి కావద్దని పేర్కొన్నారు.

Also Read: జగన్ సీఎంవో తీరుపై కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఏపీలో వైసీపీ నేతలపై దాడులు కొనసాగుతున్నాయి. వైసీపీ నేతలుపై కొందరు దాడులకు పాల్పడుతున్నారు. అయితే ఈ అంశం గురించి రాష్ట్రపతి, గవర్నర్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని నేతలు ఆరోపిస్తున్నారు. పోలీసుల ముందే దాడులు జరుగుతున్నా.. కూడా పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. ఏపీ మరో బీహార్ లాగా మారిందని మండిపడుతున్నారు. న్యాయపరంగా కోర్టును ఆశ్రయిస్తామని కొడాలి నాని తెలిపారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News