Big Stories

Jagan Mohan Reddy: అడ్డం తిరిగిన వాలంటీర్ల కథ.. నిండా ముంచేసిన జగన్‌!

Jagan Mohan Reddy Cheated Volunteers: ఏపీ సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారమే.. మొత్తం ఐదు ఫైళ్లపై సంతకాలు చేసి దేశం మొత్తం తనవైపు చూసేలా చేశారు. అభివృద్ధి, సంక్షేమాన్ని కలగలిపి ఐదు సంతకాలు చేశారు. అయితే, ఇప్పుడు అందరి దృష్టి వాలంటీర్లపై పడింది. గ్రామపాలనలో కీలకంగా వ్యవహరించడం కోసం తీసుకొస్తున్నామని వాలంటీర్ వ్యవస్థను జగన్.. తన హయాంలో ఏర్పాటు చేశారు. నిజానికి వాలంటీర్లను పాలన కోసం వాడుకుంటే అద్భుతాలు చేయవచ్చు.

- Advertisement -

ఈ విషయంలో కొంతవరకు సక్సెస్ అయ్యారు కూడా. ప్రజలకు పాలనను అందుబాటులోకి తీసుకొని వచ్చారు. ఒకప్పటిలా కులదృవీకరణ పత్రాల కోసం తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ ఇప్పుడు తిరగాల్సిన అవసరం లేదు. గ్రామంలో ఉన్న సచివాలయాల్లోనే పనులు అయిపోతున్నాయి. వాలంటీర్ వ్యవస్థ అనేది మంచి ఆలోచనే కానీ.. ఆ వ్యవస్థను ఎలా వాడుకుంటున్నామనేది చాలా ముఖ్యం. వాలంటీర్లను జగన్ తన సైన్యంలా వాడుకునే ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేయడమే కాదు.. తన సైన్యం అని జగన్ పదేపదే చెప్పేవారు కూడా.

- Advertisement -

కొంతమంది వాలంటీర్లపై పవన్ లాంటివారు సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీకి అనుకూలంగా వాలంటీర్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వాలంటీర్లు అంటే.. ప్రభుత్వంలో అదో వ్యవస్థ అని కాకుండా.. వైసీపీలో అదో టీం అనే అభిప్రాయం ప్రజల్లోనూ, ప్రతిపక్షాల్లోనూ ఏర్పడంది. చివరికి వైసీపీ కోసం వాలంటీర్లు రాజీనామా చేయడంతో ఈ అభిప్రాయం బలపడింది. అయితే, నెలకు ఐదు వేలు ఇచ్చి వాలంటీర్లతో చాలా పనులు చేయించుకునేవారు. కానీ.. చివరికి వైసీపీ నేతలు వారి గెలుపు కోసం ఎన్నికల సమయంలో ఒత్తిడి తీసుకొని వచ్చి చాలా మంది వాలంటీర్లతో రాజీనామా చేయించారు. ఇదే వాలంటీర్లకు ఇప్పుడు శాపంగా మారింది. ఏకంగా లక్షా 8 వేల మందికిపైగా వాలంటీర్లు రాజీనామా చేశారు. ప్రస్తుతం విధుల్లో ఉన్నవారు కేవలం 50 వేల పైచిలుకు మాత్రమే.

Also Read: స్పీకర్‌గా అయ్యన్న, దాదాపుగా ఖరారు..

ఇప్పుడు ప్రభుత్వం మారడంతో.. రాజీనామా చేసిన వారు.. మళ్లీ విధుల్లో చేరుతామని కొన్ని ప్రాంతాల్లో విజ్ఞప్తులు చేస్తున్నారు. అయితే.. వారిని తీసుకుంటారా? లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది. గతంలో 50 ఇళ్లకు ఉన్న ఒక వాలంటీర్‌ను ఇప్పుడు 100 ఇళ్లుకు పెంచుతారని ప్రచారం జరుగుతోంది. అంటే సగం మంది వాలంటీర్లును తప్పిస్తారు. నిజానికి తప్పించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఇప్పటికే చాలా మంది రాజీనామాలు చేశారు కాబట్టి ఉన్నవాళ్లతోనే నడిపించే అవకాశం ఉంది. ఉన్నవాళ్లు సరిపోకపోతే.. మరికొంతమందిని నియమిస్తారు. కొత్తవాళ్లను నియమించాల్సి వచ్చినా.. రాజీనామా చేసిన వాళ్లను తీసుకుంటారా అంటే అనుమానమే.

ఎందుకుంటే వాళ్లు వైసీపీ నేతలకు సపోర్ట్ చేసిన రాజీనామా చేశారు. కాబట్టి అలాంటి వారిని తీసుకోవడానికి టీడీపీ నేతలు అంగీకరించరు. పైగా వాలంటీర్ల జీతం 10 వేలు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. దీంతో.. వాలంటీర్ల ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. వైసీపీ నేతలను నమ్ముకొని అనవసరంగా రాజీనామా చేశామని వాలంటీర్లు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు.

నా సైన్యం, భవిష్యత్ నాయకులు అని చెప్పిన జగన్.. వెళ్తూ, వెళ్తూ ఆ సైన్యాన్ని శూన్యం చేసి వెళ్లిపోయారని విమర్శలు వస్తున్నాయి. ఆయన్ని నమ్ముకున్న వారంతా వీధిన పడ్డారని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుతున్నారు. టికెట్ ఇస్తారని ఆశ పెట్టుకున్న 70 మంది సిట్టింగులను, తల్లి, చెల్లి, వాలంటీర్లు ఇలా ఆయన్ని నమ్ముకున్న ఏ ఒక్కరికీ జగన్ న్యాయం చేయలేదని విమర్శలు వస్తున్నాయి. మునుగుతూ.. మునుగుతూ వాళ్లను కూడా ముంచేశాడనే అభిప్రాయం వైసీపీలో వినిపిస్తోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News