Big Stories

Jagan follow to Kcr way: కేసీఆర్ బాటలో జగన్, అసెంబ్లీకి డుమ్మా కొట్టే ఛాన్స్!

Jagan follow to Kcr way: వైసీపీ అధినేత జగన్ గురించి ఆసక్తికరమైన వార్త హంగామా చేస్తోంది. ఎన్ని కల ఫలితాల తర్వాత రెండు రోజులు మౌనంగా ఉన్నారు. వరుసగా వివిధ ప్రాంతాల నేతలతో మంతనాలు చేశారు. ఎక్కడ ఓడిపోయామన్న దానిపై నేతల నుంచి వివరాలు సేకరించారు.

- Advertisement -

కొత్త ప్రభుత్వ వ్యవహారశౌలిని జాగ్రత్తగా గమనిస్తున్నారు మాజీ సీఎం జగన్. ఇప్పుడున్న పరిస్థితుల్లో అధికార పార్టీకి వీలైనంత దూరంగా ఉండాలని ఆలోచన చేస్తున్నారని సమాచారం. బుధవారం నుంచి మూడురోజుల పులివెందులకు వెళ్తున్నారు మాజీ సీఎం. కొద్దిరోజులపాటు రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మళ్లీ 22న తాడేపల్లికి రానున్నారు.

- Advertisement -

పులివెందుల నుంచి రాగానే వైసీపీ నేతలందరితో సమావేశానికి ప్లాన్ చేశారు వైసీపీ అధినేత. ఈసారి నేతల నుంచి అవుట్‌పుట్ తీసుకోవాలన్నది అధినేత ఆలోచనగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీలో జరిగే ప్రమాణ కార్యక్రమానికి జగన్ రావడం కష్టమనే అభిప్రాయం ఆ పార్టీల నేతల నుంచి వ్యక్తమవుతోంది. ఎందుకంటే ఈనెల 21, 22 అసెంబ్లీ సమావేశం కానుంది. తొలిరోజు సభ్యుల ప్రమాణం, రెండోరోజు స్పీకర్ ఎంపిక జరగనుంది.

ఎందుకంటే వైసీపీకి ఉన్నది కేవలం 11 మంది మాత్రమే. అసెంబ్లీలో అధికార పార్టీ నేతల సెటైర్లు, కామెంట్స్ చేస్తారని భావించి దూరంగా ఉండాలని అంటున్నారట. ఈ విషయంలో కేసీఆర్ అనుసరిస్తున్న మార్గంలో ఆయన నడవాలన్నది అసలు సారాంశం. ఈ లెక్కన జగన్ అసెంబ్లీకి రావడం అనుమానమేనని అంటున్నారు. వీలు చూసుకుని స్పీకర్ ఛాంబర్‌కి ప్రమాణ స్వీకారం చేస్తే సరిపోతుందని అంటున్నారు.

ALSO READ: ఈవీఎంలపై జగన్ ట్వీట్.. పులివెందుల పులి ఏదో అంటుందంటూ జనసేన శతాఘ్ని కౌంటర్

గత ప్రభుత్వంలో చేసిన అవినీతి చిట్టాను చాలావరకు అధికార పార్టీ  రెడీ చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో అసెంబ్లీకి వెళ్లడం కంటే దూరంగా ఉంటే బెటరని అంటున్నారు. దీనిపై పులివెందుల టూర్‌లో జగన్ ఓ నిర్ణయం తీసుకోవచ్చని అంటున్నారు. ఒకవేళ అధినేత రాకపోయినా, మిగతా ఎమ్మెల్యేలు హాజరై ప్రమాణ కార్యక్రమంలో పాల్గొంటారని అంటున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News