Big Stories

PM Modi: అది అట్టర్‌ఫ్లాప్! అందుకేనా 2000 నోటు బ్యాన్?

modi-2000 note

PM Modi: 2016 నవంబర్ 8. రాత్రి ప్రైమ్ టైమ్‌లో దేశమంతా బ్రేకింగ్ న్యూస్. ప్రధాని మోదీ లైవ్. ‘మిత్రో’ అంటూ చాలా గంభీరంగా మాట్లాడారు మోదీ. ఆ రోజు అర్థరాత్రి నుంచి 500, 1000 నోట్లు రద్దు అవుతాయంటూ సంచలన ప్రకటన చేశారు. అంతే. విన్నవాళ్లంతా షాక్. భారతీయుల మైండ్ బ్లాంక్. విషయం నిమిషాల్లోనే పాకిపోయింది. టీవీల ముందునుంచి బయటికొస్తే.. అంతా అదే టాపిక్. తొందరపడి పెద్ద నోట్లు మార్చుకుందామంటే ఎవరూ తీసుకోలే. జనం ఆగమాగ మయ్యారు. బ్యాంకుల్లో నోట్లు మార్చుకోడానికి కొంత గడువిచ్చారు. రోజుల తరబడి పెద్ద పెద్ద క్యూ లైన్లు. ఏటీఎంల ముందు పడిగాపులు. కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. పెళ్లిళ్లు ఆగిపోయాయి. వ్యాపారాలు దెబ్బ తిన్నాయి. చిన్న వ్యాపారులు చితికిపోయారు. దేశ ఆర్థిక వ్యవస్థ కొన్నాళ్ల పాటు స్థబ్దుగా మారిపోయింది. అంతటి సంచటన నిర్ణయం డీమానిటైజేషన్.

- Advertisement -

ఆ సమయంలో ప్రధాని మోదీ గొప్ప గొప్ప మాటలు చెప్పారు. పెద్ద నోట్ల రద్దుతో బ్లాక్ మనీకి చెక్ పడుతుంది.. ఉగ్రవాదం తగ్గుతుందని.. దొంగ నోట్లు బంద్ అవుతాయని.. ఇలా చాలానే చెప్పారు. 500, 1000 నోట్లకు బదులుగా.. కొత్తగా 200, 500, 2000 నోట్లు తీసుకొస్తామని ప్రకటించారు. అది విని మరింత ఆశ్చర్యం. 500, 1000 నోట్లనే దాచి బ్లాక్‌మనీగా పోగేస్తే.. ఇక 2వేల నోట్లు తీసుకొస్తే.. దాయడం మరింత సులువు కదా? బ్లాక్ మనీ మరింత పెరుగుతుంది కదా? అనే డౌట్ సామాన్యుడికి వచ్చింది. కానీ, ఇంత చిన్న లాజిక్ మాత్రం దేశ పెద్దలకు రాకపోవడం ఆశ్చర్యకరం. ఆనాడు ప్రధాని మోదీ నిర్ణయాన్ని అంతా స్వాగతించారు.. ప్రశంసించారు. మోదీని ఆహో ఓహో అంటూ కీర్తించారు. రోజుల తరబడి ఆ టాపిక్‌పై చర్చలు జరిగాయి.

- Advertisement -

కట్ చేస్తే, డీమానిటైజేషన్ చేసిన సుమారు ఏడేళ్ల తర్వాత.. ఇప్పుడు 2వేల నోటు రద్దు చేస్తూ ఆర్బీఐ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. క్లీన్ నోట్ పాలసీలో భాగంగానే 2వేల నోటు ఉపసంహరించుకున్నామని తెలిపింది. మార్చుకోవడానికి సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చింది. ఏడేళ్ల క్రితం పీఎం మోదీ తీసుకొచ్చిన 2వేల నోటుకు అప్పుడే ఆయుష్షు తీరిందంటే.. ఆ నిర్ణయం అట్టర్‌ఫ్లాప్ అయినట్టేనా? డీమానిటైజేషన్ ఫెయిల్ అయినట్టేనా? 2వేల నోటు తేవడం కేంద్ర వైఫల్యం అన్నట్టేగా? మోదీ చెప్పినట్టు బ్లాక్ మనీ తగ్గలేదన్నట్టేగా? నల్ల ధనం మరింత పెరిగినట్టేగా? అందుకేనా ఇప్పుడీ 2000 నోటు రద్దు?

మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. గతంలో మాదిరి ప్రధాని మోదీ ఈసారి టీవీల ముందుకొచ్చి సడెన్‌గా ఈ బ్రేకింగ్ న్యూస్ చెప్పకపోవడం. సింపుల్‌గా ఆర్బీఐ నుంచి ప్రకటన రిలీజ్ చేయించారు. అది కూడా ప్రధాని మోదీ దేశంలో లేని సమయంలో.. ఆయన విదేశీ పర్యటనకు వెళ్లిన కొన్ని గంటల తర్వాత ఈ ప్రకటన రావడం ఏంటో? మళ్లీ మీడియా ముందుకొస్తే మరింత పరువు పోతుందని అనుకున్నారో.. జనాలు నవ్వుకుంటారని భావించారో.. కారణం ఏదైనా ఈసారి మోదీ సైడ్ అవడం ఇంట్రెస్టింగ్ పాయింట్.

2000 నోటు రద్దు అని తెలీగానే.. గతంలో మాదిరి ఈసారి ప్రజలేమీ అవాక్కవ్వట్టే. బెంబేలెత్తిపోవట్లే. చాలా కూల్‌గా, రిలాక్డ్స్‌గా టీవీల్లో న్యూస్ చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే.. ఈ న్యూస్ విన్న ఏ ఒక్కరి దగ్గర కూడా.. ఒక్క 2000 నోటు కూడా లేకపోవడమే రీజన్.

అవును, ఇప్పుడంటే ఆర్బీఐ బ్యాన్ చేసింది కానీ.. 2వేల నోటు ఎప్పటినుంచో కనిపించడం లేదు. బ్యాంకుల్లో ఇవ్వట్లే. ఏటీఎంలలో రావట్లే. ఏ షాపుల్లోనూ లే. మరెక్కడికి పోయినట్టు? పెద్ద నోటు ఏమైనట్టు? సింపుల్, అదంతా బ్లాక్ మనీగా ఎప్పుడో పెద్దోళ్ల ఇళ్లల్లో దాక్కుంది. కొత్తగా వచ్చిన తొలినాళ్లలో మాత్రమే కనిపించిందా పింక్ నోట్. చూట్టానికి క్యూట్‌గా ఉండేది. ఆ తర్వాత చూద్దామన్నా పత్తా లేకుండా పోయింది. గుద్దిన నోట్లు గుద్దినట్టు దాచేశారు సంపన్నులు. బ్యాంకుల నుంచి నేరుగా సూటుకేసుల్లో పెద్దోళ్ల ఇంటికి వెళ్లిపోతున్నాయన్నారు. కేవలం ఎన్నికలు జరిగే చోట మాత్రమే ప్రత్యక్షమయ్యేది. పెద్ద పెద్ద డీల్స్‌లో చేతులు మారేది. చాలాకాలంగా పెద్ద నోటు కేవలం పెద్దోళ్లకే పరిమితమైంది. అందుకే, 2వేల నోటు రద్దు అనగానే.. సామాన్యుడు బిందాస్. మునుపటిలా నో టెన్షన్.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News