Big Stories

AP Capital Amaravati : ఆంధ్రుల రాజధాని అమరావతికి అండగా.. సీఎం చంద్రబాబు ఉండగా దిగులేలా ?

AP Capital Amaravati latest news(Andhra news today): అమరావతి.. ఆంధ్రుల రాజధాని. కానీ వైసీపీ పాలనలో నిర్లక్ష్యానికి గురై.. ప్రస్తుతం పిచ్చి మొక్కలకు కేరాఫ్‌ అయ్యింది. కానీ ఎప్పుడైతే చంద్రబాబు సీఎంగా చార్జ్‌ తీసుకున్నారో.. అప్పుడే అమరావతి మళ్లీ ఊపిరి పీల్చుకోవడం మొదలైంది. కానీ ఇక నడక కాదు.. పరుగులు పెట్టాల్సిన సమయం వచ్చిందంటూ మరోసారి సరికొత్తగా బూస్టింగ్ ఇచ్చారు చంద్రబాబు. చెప్పినట్టుగానే అమరావతి ప్రాంతాభివృద్ధిపై శ్వేతపత్రాన్ని రిలీజ్ చేశారు. ఇంతకీ ఈ వైట్ పేపర్‌లో ఏముంది? రాజధాని ప్రాంత అభివృద్ధిపై చంద్రబాబు ఏమన్నారు ?

- Advertisement -

తాము ఆంధ్రులకు.. ఆంధ్రుల అభివృద్ధికి కేరాఫ్‌గా ఉండేలా అమరావతిని అభివృద్ధి చెద్దామని అనుకున్నామని.. కానీ అమరావతిని ఎంత నాశనం చేయాలో అంతా చేసి వదిలేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు. ఇది నిజమే.. ఎందుకంటే అమరావతి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా.. చంద్రబాబు ఎక్కడైతే వదిలి వెళ్లారో.. అక్కడే అన్నట్టుగా ఉంది. ప్రతి గ్రామం నుంచి మట్టి తీసుకొచ్చి అమరావతిలో ఉంచారు. యమునా నది నీరు, పార్లమెంట్ మట్టిన ప్రధాని మోడీ తీసుకొచ్చారు. దేశంలోని ప్రముఖ ఆలయాల పవిత్ర జలం, మట్టి తీసుకొచ్చారు. 29 వేల మంది రైతులు.. 34 వేల 400 ఎకరాల భూమి ఇచ్చారు. రైతులకు, రైతు కూలీలకు పరిహారం ఇచ్చాం. ప్రభుత్వ భూమి, రైతులు ఇచ్చిన భూమి.. అంతా కలిపి 53 వేల 745 ఎకరాల భూమి ఉంటే.. వైసీపీ ప్రభుత్వం చేసింది ఏంటి? ఏం లేదు. సింగపూర్‌లాంటి సిటీని చేద్దామనుకుంటే.. ఘోస్ట్ సిటీగా మార్చేశారు. ఇదీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన విమర్శలు.

- Advertisement -

అమరావతి చేసిన పాపమేంటి? అని ప్రశ్నించారు చంద్రబాబు. కరుడు గట్టిన ఉగ్రవాదులు కూడా అమరావతిని వ్యతిరేకించరని.. కానీ కొందరు అర్థంలేకుండా, విచక్షణ కోల్పోయి అమరావతిని అభివృద్ధి కాకుండా అడ్డుకున్నారని తెలిపారు. 1631 రోజులు అమరావతి రైతులని, మహిళలని ఎన్ని రకాలుగా హింస పెట్టొచ్చో, అన్ని రకాలుగా వాళ్ళని హింసించారన్నారు చంద్రబాబు. ఒక వ్యక్తి మూర్ఖత్వం, కక్ష, తుగ్లక్ నిర్ణయాలు 5 కోట్ల మంది ఆంధ్రులకు శాపాలు అయ్యాయంటూ మాజీ సీఎం జగన్‌పై విరుచుకుపడ్డారు.

Also Read : ఏపీ రాజధాని అమరావతిపై శ్వేతపత్రం విడుదల

తొమ్మిది విభాగాల్లో అమరావతి హబ్‌గా మారాలని ఆకాంక్షించామని.. ఫైనాన్షియల్‌, నాలెడ్జ్‌, టూరిజం, ఎలక్ట్రానిక్‌, హెల్త్‌ సిటీ ప్రతిపాదించామని.. కానీ జగన్‌ వచ్చాక అమరావతిలో జరుగుతున్న పనులను ఆపేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజావేదిక కూల్చేశారు. ఏ కట్టడం కట్టాలన్నా పదిసార్లు ఆలోచిస్తాం.. కానీ చాలా సింపుల్‌గా కూల్చేశారని.. కావాలనే ఆ శిథిలాలను తొలగించలేదని మరోసారి గుర్తు చేశారు చంద్రబాబు.

ఇదంతా గతం.. మరి చంద్రబాబు అమరావతిని ఎలా డెవలప్ చేయబోతున్నారు. ఒక్కసారి పెట్టుబడి దారులు నమ్మకం కోల్పోతే మళ్లీ ఆ నమ్మకాన్ని సాధించడం కష్టం. మరి వారిని ఎలా ఒప్పిస్తారు చంద్రబాబు. ఏ విధంగా మళ్లీ నిర్మాణాలను ప్రారంభిస్తారు? ఇవీ ఇప్పుడు ఆయన ముందున్న సవాళ్లు. అయితే శిథిలాల నుంచే బంగారు భవిష్యత్తుకు నాంది పలుకుతామంటున్నారు చంద్రబాబు. ఇప్పటికే అమరావతిలో పనులు ప్రారంభమయ్యాయని.. అంచెంలంచెలుగా పనులు పూర్తి చేస్తామని చాలా కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు.

నిజానికి ఏపీ ఎన్నికల్లో టీడీపీ గెలుపుతోనే అమరావతి నూతన శకం ప్రారంభమైందనే చెప్పాలి. ఎన్నికల ముందే ఆయన చెప్పారు.. ఏపీకి ఒక్కటే రాజధాని అని.. అది కూడా అమరావతే అని కుండబద్ధలు కొట్టారు. చెప్పినట్టుగానే గెలిచిన వెంటనే అమరావతిలో పర్యటించారు. చెప్పినట్టుగానే అమరావతిపై శ్వేతపత్రం రిలీజ్ చేశారు. కాబట్టి ఇన్‌ నియర్ ఫ్యూచర్.. చెప్పినట్టుగానే అమరావతిని డెవలప్ చేసి చూపిస్తారన్న కాన్ఫిడెన్స్‌ అయితే ఆయనలో కనిపిస్తోంది. అదే జరగాలని మనమూ ఆశిద్దాం.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News