Big Stories

Heavy Rains Alert: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన.. ఈ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు!

Heavy Rain alert to Andhra Pradesh and Telangana: నైరుతి రాకతో చల్లబడిన తెలుగు రాష్ట్రాల్లో కొద్దిరోజులుగా ఉక్కపోత పెరిగింది. దీంతో జనం మళ్లీ ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు నైరుతి రుతుపవనాలు బలపడటంతో పాటు.. గుజరాత్ మీదుగా తూర్పు విదర్భ వరకూ ద్రోణి ఏర్పడటంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రానున్న నాలుగైదు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. యూపీ, ఉత్తరాఖండ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోనూ అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

- Advertisement -

ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో నేటి నుంచి 5 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలతో పాటు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, కృష్ణా, పార్వతీపురం మన్యం జిల్లాల్లో భారీ వర్షాలు కురవవచ్చని అంచనా వేసింది. కొన్నిప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు కూడా పడవచ్చని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

- Advertisement -

నేడు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, కోస్తా, గోదావరి జిల్లాలైన తూర్పుగోదావరి, అనకాపల్లి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, పల్నాడు, బాపట్ల, తిరుపతి, కడప, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది వాతావరణశాఖ.

Also Read: Delhi Airport roof collapsed: మోదీ ప్రారంభించిన భవనం కాదు.. మృతుడికి 20 లక్షలు:మంత్రి రామ్మోహన్

అలాగే రేపు.. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, అనకాపల్లి, శ్రీకాకుళం, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, గుంటూరు, కృష్ణా, కోనసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి.

ఇటు తెలంగాణలోనూ నేటి నుంచి 4 రోజులపాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణశాఖ అంచనా వేసింది. హైదరాబాద్ లో గంటకు 10-12 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అలాగే నేడు.. సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్, భద్రాద్రి, ఖమ్మం, ములుగు, భూపాలపల్లి, నల్గొండ, వరంగల్, హన్మకొండ, జనగాం, సూర్యాపేట, భువనగిరి, సిద్ధిపేట, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News