Big Stories

Monsoon Updates in AP: ఏపీలో భారీ వర్షాలు.. ఎప్పట్నుంచంటే..?

Rainfall updates in AP(Latest news in Andhra Pradesh): ఏపీలో వచ్చే రెండు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొన్నది. అయితే, బంగాళాఖాతంలో అల్పపీడనం క్రమంగా బలపడుతుంది… ఈ నేపథ్యంలో అత్స్యకారులెవరూ వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు.

- Advertisement -

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం క్రమంగా వాయుగుండంగా మారుతోందని, ఇది ఈ నెల 26వ తేదీ సాయంత్రం వరకు అది మరింత బలపడి తుపానుగా మారబోతుందని తెలిపింది. ఈశాన్యంగా కదులుతూ బంగాళాఖాతంలో తుపానుగా మారనున్నదని, ఈ క్రమంలో ఏపీ తీర ప్రాంతానికి ఎలాంటి ముప్పేమీ లేదని పేర్కొన్నది. అయితే, శుక్రవారం నాటికి మాత్రం అల్పపీడనం బలమైన వాయుగుండంగా మారనున్న నేపథ్యంలో రాగల రెండు రోజులపాటు ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తీర ప్రాంత జిల్లాల్లో చాలా చోట్లా భారీ వర్షాలు కురుసే అవకాశముందని తెలిపింది.

- Advertisement -

ఈ నేపథ్యంలో మత్స్యకారులెవరూ వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలోని అల్లూరి, పార్వతీపురం మన్యం జిల్లాలతోపాటు కోనసీమ, ఏలూరు, కాకినాడ, ఎన్టీఆర్, సత్యసాయి జిల్లాల్లో చాలా చోట్లా వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. అదేవిధంగా అనకాపల్లి, శ్రీకాకుళం, కృష్ణా, గుంటూరు, తిరుపతి, చిత్తూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు, ప్రకాశం, అనంతపురం, కడప, బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో వర్షాలు కురుసే అవకాశముందని తెలిపింది. ఆ సమయలో పిడుగులు పడే అవకాశముందని పేర్కొన్నది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అదేవిధంగా ఇతర సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.

ఇదిలా ఉంటే దేశంలో భిన్న వాతావరణం ఏర్పడుతుంది. పలు రాష్ట్రాల్లో భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరికొన్ని రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. కేరళ రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. నలుగురు వ్యక్తులు మృతిచెందారు. వచ్చే మరికొన్ని రోజులపాటు కూడా వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇటు మరికొన్ని రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

Also Read: మాచర్ల వీడియో ఎలా బయటకు వచ్చిందో తెలీదన్న సీఈఓ.. సజ్జల, అంబటి రియాక్షన్ ?

రాజస్థాన్ లోని బార్మర్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైన విషయం తెలిసిందే. ఇటు హర్యానాలో కూడా 47.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పంజాబ్ లోని భటిండాలో కూడా 46.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 44.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హర్యానా, యూపీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, జమ్మూకాశ్మీర్, పంజాబ్, ఢిల్లీలలో ఈ నెల 26 వరకు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ అంచనా వేసింది. ఈ క్రమంలో ఎక్కువమంది ఎండదెబ్బకు గురయ్యే ఛాన్స్ ఉంది.. అలర్ట్ గా ఉండాలని ప్రజలకు సూచించిన విషయం విధితమే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News