Big Stories

AP DSC TET 2024 Updates: ఏపీ టెట్, మెగా డీఎస్సీపై ప్రభుత్వం కీలక నిర్ణయం !

AP DSC TET 2024 Updates: ఏపీలో టెట్, డీఎస్సీ పరీక్షలకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు సమయం ఇవ్వాలని నిర్ణయించింది. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. త్వరలోనే ప్రభుత్వం టెట్, డీఎస్సీ పరీక్షల తేదీలను ప్రకటించనుంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ మొత్తం ప్రక్రియను 6 నెలల్లోనే పూర్తి చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని అధికారులకు నారా లోకేష్ ఆదేశాలు జారీ చేశారు. కొత్తగా బీఈడీ, డీఎడ్ పూర్తి చేసుకున్న వారికి కూడా మెగా డీఎస్సీలో అవకాశం కల్పించనున్నారు.

- Advertisement -

టెట్, మెగా డీఎస్సీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు మరింత సమయం కావాలని విద్యార్థి, యువజన సంఘాల నేతలు, పలువురు ఎమ్మెల్సీలు లోకేష్‌ను కలిసి విజ్ఞప్తి చేసారు. ప్రిపరేషన్‌కు సమయం ఇవ్వాలని కోరడంతో వారి విజ్ఞప్తి మేరకు నారా లోకేష్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అభ్యర్థులకు టెట్‌కు 90 రోజులు, మెగా డీఎస్సీకి 90 రోజులు సమయం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే పరీక్షల కొత్త తేదీలను త్వరలోనే ప్రకటించనున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. మొత్తంగా ఈ ఏడాది డిసెంబర్ లోగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేసి 2025 నాటికి ఉద్యోగాలు ఇచ్చేలా కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను మంత్రి లోకేష్ ఆదేశించారు.

- Advertisement -

గత ప్రభుత్వ హయాంలో ప్రకటించిన డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మెగా డీఎస్సీలో ఫీజు మినహాయింపు ఇవ్వాలని మంత్రి అధికారులకు సూచించారు. ఎలాంటి విమర్శలకు తావు లేకుండా మెగా డీఎస్సీ పకడ్భందీగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం టెట్, డీఎస్సీ నిర్వహణ అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై కూడా అధ్యయనం చేయాలని తెలిపారు. టెట్, డీఎస్సీ మధ్య ఎక్కువ సమయం ఉండాలని వస్తున్న అభ్యర్థుల విజ్ఞప్తులను, అభిప్రాయాలను సేకరించాలని తెలిపారు.

పాఠశాలల్లో హేతుబద్ధీకరణకు తీసుకొచ్చిన 117 జీవో వల్ల కలిగిన నష్టాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అన్నారు, ఏపీ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలల్లో పొరుగు సేవల బోధనా సిబ్బంది డిమాండ్లపై అధ్యయనం చేసి వారికి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఎన్నికలకు ముందు గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఇవ్వాలని తెలిపారు.

Also Read: ఏపీ రాజధాని అమరావతిపై శ్వేతపత్రం విడుదల

మెగా డీఎస్సీలో వయోపరిమితి సడలింపుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. మెగా డీఎస్సీలో కొన్ని జిల్లాలకు ఎస్‌జీటీ పోస్టులు తక్కువగా ఉన్నాయని పలువురు తమ దృష్టికి తెచ్చారని లోకేష్ ప్రస్తావించారు. ప్రకాశం జిల్లాలో ఉపాధ్యాయుల పదోన్నతులపై కొంతమంది కోర్టును ఆశ్రయించారని దీనివల్ల పోస్టులు తగ్గాయని అన్నారు. అనంతపురం, శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాలో న్యాయపరమైన వివాదాలను పరిష్కరించి పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు. ప్రయివేటు పాఠశాలల అనుమతుల రెన్యువల్ లో అనవసర ఆంక్షలు విధించవద్దని అన్నారు. యువత నైపుణ్యాలను గుర్తించేందుకు స్కిల్ సెన్సెస్ చేపట్టేందుకు యోచిస్తున్నట్లు వెల్లడించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News