Big Stories

Minister Kandula Durgesh: ఏపీ వాలంటీర్లకు త్వరలోనే గుడ్ న్యూస్: మంత్రి కందుల దుర్గేష్

Minister Kandula durgesh to AP Volunteers(Andhra news today): ఏపీ వాలంటీర్ వ్యవస్థపై త్వరలోనే మంచి నిర్ణయం తీసుకుంటామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. నిడదవోలులో ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వానికి మించి కూటమి సర్కారు సంక్షేమం అందిస్తోందని తెలిపారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళతామని చెప్పారు. వైసీపీ హయాంలో ప్రభుత్వం ఐదేళ్లలో పెన్షన్ రూ. వెయ్యి మాత్రమే పెంచిందని అన్నారు.

- Advertisement -

కానీ.. కూటమి అధికారంలోకి రాగానే పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచి 3 నెలలతో కలిపి మొత్తం రూ. 7 వేలు ఇస్తుందని పేర్కొన్నారు. జూలై 1వ తేదీ రోజు 90 శాతం వరకు పెన్షన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వ అస్తవ్యస్త విధానాల వల్ల ఏపీలో అభివృద్ధి కుంటు పడిందని ఆరోపించారు. ఎన్నికల హామీ మేరకు పెన్షన్ పెంచామని, జూలై 1 నుంచి పెరిగిన పెన్షన్ అందిస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వానికి మించి సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంపై భారం ఉన్నప్పటికీ ఇచ్చిన హామీలను అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు.

- Advertisement -

పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయకపోవడం వల్లే గత ప్రభుత్వం ప్రజల తిరస్కరణకు గురయిందన్నారు. పాపికొండల విహార యాత్ర ప్రారంభమైందని తెలిపారు. గత సంఘటనలు దృష్టిలో ఉంచుకుని రక్షణ చర్యలు తీసుకోవడానికి తానే స్వయంగా పనులను పరిశీలించి పర్యాటకులతో మాట్లాడి, అవసరమైన సదుపాయాలను కల్పించడానికి సిద్దంగా ఉన్నానని తెలిపారు.

జూలై1న చంద్రబాబు పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలులో పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. తాను నిడదవోలు నియోజకవర్గంలోని గోపవరంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ఆర్థికపరమైన అంశాల్లో భాగంగా సీఎం ఇప్పటికే పోలవరం అంశానికి సంబంధించి శ్వేతపత్రాన్ని విడుదల చేశారని వెల్లడించారు. గత ప్రభుత్వం ఎన్నికలకు ముందు రైతులకు ఆర్థిక సాయాన్ని అందజేయలేదని అన్నారు. రైతు సంక్షేమాన్ని కాంక్షించేది తమ ప్రభుత్వమేనని అన్నారు.

Also Read: మన్ కీ బాత్‌.. సీఎం చంద్రబాబుతో కలిసి ప్రధాని మోదీ..

రైతులకు ఆర్థిక సహాయాన్ని అందజేస్తామని వెల్లడించారు. ఇప్పటికే ఈ అంశంపై కేబినెట్‌లో చర్చించామని అన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం, స్పష్టమైన అవగాహన లేకపోవడం వల్ల పోలవరం ప్రాజెక్ట్ అభివృద్ధికి నోచుకోలేదని తెలిపారు. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన నుంచి యుద్ధ ప్రాతిపదికన పోలవరం ప్రాజెక్ట్ పరిశీలించారని అన్నారు. ఎక్కడ లోపాలున్నాయో గుర్తించి ప్రాజెక్ట్ పనులు వేగవంతం చేసేందుకు అంతర్జాతీయ సాంకేతిక నిపుణుల బృందాన్ని పరిశీలించేందుకు ఏర్పాట్లు చేస్తున్న వెల్లడించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News