Big Stories

Gautam sawang resign: ఏపీపీఎస్సీ ఛైర్మన్ పదవికి గౌతమ్ సవాంగ్ రాజీనామా, ఆయన స్థానంలో..

Gautam sawang resign: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వంలో మార్పులు వేగంగా జరుగుతున్నాయి. సీఎం చంద్రబాబు జోరు చూసి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు షాకవుతున్నారు. ఈ క్రమంలో వైసీపీతో అట్టకాడిన అధికారులకు ముచ్చెమటలు పడుతున్నాయి. మరి ఏం జరిగిందో తెలీదుగానీ ఏపీపీఎస్పీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు గౌతమ్ సవాంగ్.

- Advertisement -

ఏపీ పరిపాలనలో అనుహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. బుధవారం ఏపీపీఎస్పీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు అందజేయడం, ఆయన ఓకే చేయడం చకచకా జరిగిపోయింది. మరో రెండేళ్లు పదవీకాలం ఉండగానే ముందుగానే ఆయన రాజీనామా చేశారు. వైసీపీ ప్రభుత్వం 2022లో ఆయన్ని ఏపీపీఎస్పీ ఛైర్మన్‌గా ఆయనకు బాధ్యతలు అప్పగించింది. అంతకుముందు ఆయన ఏపీ డీజీపీగా పనిచేశారు.

- Advertisement -

గౌతమ్ సవాంగ్ డీజీపీగా ఉన్న సమయంలో అమరావతిలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు పర్యటిం చారు. ఆయన కాన్వాయ్‌పై వైసీపీ మద్దతుదారులు రాళ్లు, చెప్పులు విసిరారు. ఆ సమయంలో ప్రజల ఆవేదనను అర్థం చేసుకున్న ఆయన, భావ ప్రకటన, నిరసన తెలిపే స్వేచ్ఛ ప్రజలకు రాజ్యాంగ కల్పించిందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఇదేకాకుండా చాలా విషయాల్లో ఆయన వైసీపీ ప్రభుత్వానికి అండగా నిలిచారు. అప్పటి జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారిపై కార్యకర్తల నుంచి నేతల వరకు వరుసగా కేసు నమోదు చేసిన ఘటన ఆయనకే చెందుతుంది. అంతేకాదు చంద్రబాబు విశాఖ వెళ్తే ఆయనను ఎయిర్ పోర్టు నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు పోలీసులు. ఈ వ్యవహారంపై స్వయంగా డీజీపీ హైకోర్టు ముుందు హాజరై వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అంతేకాదు ప్రతిపక్షాలు, ప్రజాసంఘాల ఆందోళనను ఉక్కుపాదంతో అణిచి వేశారు గౌతమ్ సవాంగ్. ప్రతిపక్షాలకు 144 సెక్షన్‌ను బూచిగా చూపించి అరెస్టు చేసేశారు. ముఖ్యంగా రాజధానిపై పోరాడుతున్న అమరావతి రైతులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను నమోదు చేసిన ఘటనను ఆయన సొంతం చేసుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి.

2022 డీజీపీ పదవికి రాజీనామా చేయించిన అప్పటి వైసీపీ సర్కార్, ఆయనను ఏపీపీఎస్పీ ఛైర్మన్ పదవిలో కూర్చోబెట్టింది. పేరుకే పదవికి గానీ, వైసీపీకి చెందిన కీలక వ్యక్తులు వెనుక నుంచి చక్రం తిప్పేవారు. చివరకు ఏపీపీఎస్పీ ఛైర్మన్‌గా గౌతమ్ సవాంగ్ డమ్మీ అయిపోయారనే విమర్శలు వెల్లువెత్తాయి.

ఇంతవరకు బాగానే ఉంది… ఇంతకీ ఏపీపీఎస్సీ ఛైర్మన్ పదవి ఎవరికి ఛాన్స్ దక్కనుంది? మాజీ ఐఏఎస్ అధికారులకు ఇస్తారా? లేక ఐపీఎస్‌లకు అప్పగిస్తారా అన్నదానిపై పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ పోస్టుకు మాజీ ఐఏఎస్ అధికారి నిమ్మగడ్డ రమేష్‌కు ఇచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు.

ALSO READ: కంభంపాడు ఘటనపై ఎమ్మెల్యే వివరణ కోరిన సీఎం

ఎందుకంటే అప్పటి వైసీపీ సర్కార్‌లో ఎన్నికల అధికారిగా ఆయన బాధ్యతలు నిర్వహించారు. చాలా విషయాల్లో ప్రభుత్వం చేస్తున్న పనులను తప్పుబట్టారు. అంతేకాదు రిటైర్మెంట్ తర్వాత వైసీపీ సర్కార్ చేసిన అరాచకాలను ప్రతీ జిల్లాకు వెళ్లి మేధావులకు వివరించేవారు. ఈ క్రమంలో ఛైర్మన్ పదవి నిమ్మగడ్డకే ఇవ్వవచ్చని సీనియర్ రాజకీయ నేతల మాట. మరి సీఎం చంద్రబాబు మదిలో ఏముందో?

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News