Big Stories

Free Sand Policy in AP: ఏపీలో ఇసుక ఫ్రీ.. ఈ నెల 8 నుంచి అమలు..!

 Free Sand Policy in Andhra Pradesh: ఏపీలో ఈ నెల 8 నుంచి ఉచిత ఇసుక విధానాన్ని అమలులోకి తీసుకురావాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు చర్యలు చేపట్టాలని మంత్రి కొల్లు రవీంద్రకు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ల అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసి ఈ కమిటీ ఆధ్వర్యంలో లోడింగ్, రవాణా ఛార్జీలను నిర్ణయించనున్నట్లు సమాచారం.

- Advertisement -

ఇసుక అక్రమ తవ్వకాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. 2014- 2019 మధ్య కాలంలో రాష్ట్రంలో అమలులో ఉన్న ఇసుక విధానం, 2019-2024 మధ్య అమ్మకాల లాభ, నష్టాలపై అధికారులతో చంద్రబాబు చర్చించారు. గత ఐదేళ్లుగా ఇసుక అమ్మకాల పేరుతో భారీగా దోపిడి జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఫ్రీ ఇసుక పాలసీ ద్వారా పేదలకు ఉచితంగా ఇసుక అందించాలని నిర్ణయించింది.

- Advertisement -

ఇసుక అమ్మకాల విధానంలో ఎవరు లబ్దిపొందారు అనే దానిపై ఆరా తీసారు. జగన్ పాలనలో ఇసుక పాలసీ వల్ల పేదలు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. అంతే కాకుండా గత ప్రభుత్వ హయాంలో గృహ నిర్మాణ రంగం పూర్తిగా కుదేలయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇసుక డంప్‌లు వైసీపీ నేతలు, ప్రయివేటు వ్యక్తుల చేతుల్లో ఉన్నాయన్న సమాచారం ఉందని తెలిపారు. వైసీపీ నేతలు భారీగా ఇసుక ధరలను పెంచి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.

Also Read: పట్టిసీమ నుంచి నీటి విడుదల.. ఇది ఒట్టిసీమ కాదు : మంత్రి నిమ్మల

ఉచిత ఇసుక విధానం అమల్లోకి తీసుకొచ్చినా.. దానికి కూడా ఆన్ లైన్ పర్మిట్లు జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇసుక అవసరమైన వారికి స్థానిక సంస్థల ద్వారా పర్మిట్లు అందజేస్తే అక్రమాలకు అవకాశం ఉండదని ఈ నిర్ణయం తీసుకుంది.

పర్మిట్లు ఆపేయడంతో భారీగా నష్టం

రాష్ట్రంలో అన్ని ఖనిజాలకు ఆన్‌లైన్ పర్మిట్ల జారీ నిలిపివేశారు. సిమెంట్ కంపెనీల విజ్ఞప్తి మేరకు సున్నపురాయికి మాత్రమే పరిమితులను ఇస్తున్నారు. గ్రానైట్ రోడ్ మెటల్, సిలికా శాండ్, తదితర ఖనిజాలకు పర్మిట్లు ఇవ్వకపోవడంతో ప్రభుత్వం ప్రతి రోజు సగటున రూ. 5 కోట్ల చొప్పున రాబడి కోల్పోవాల్సి వస్తోందని సీఎం చంద్రబాబు దృష్టికి అధికారులు తీసుకుచ్చారు. కాగా బుధవారం జరిగిన అధికారుల సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నారు.

ఐదేళ్లలో రోడ్లు సర్వనాశనం
గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం రహదారులను సర్వనాశనం చేసిందని కనీసం గుంతలు కూడా పూడ్చలేదని సీఎం చంద్రబాబు అన్నారు. గుంతల రోడ్ల తక్షణ మరమ్మతులపై ఆర్‌అండ్‌బీ అధికారులతో ఆయన సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రమంతటా ఎన్ని కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయి, ఎక్కడ ఎక్కడ గుంతలు ఉన్నాయో.. వాటి వివరాలపై ఆరా తీశారు. వాటికి త్వరగా మరమ్మతులు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.

Also Read: AP Capital Amaravati : ఆంధ్రుల రాజధాని అమరావతికి అండగా.. సీఎం చంద్రబాబు ఉండగా దిగులేలా ?

ఇసుక పంపిణీలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు
గత ప్రభుత్వ హయాంలో ఇసుక విధానంలో ఐదేళ్లుగా పేదప్రజలను దోచుకున్నారని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. ఉచిత ఇసుక విధానానికి విధి విధానాలు తయారు చేస్తున్నట్లు చెప్పారు. ఇసుక ఫాలసీపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. ఇసుక నిల్వ కేంద్రాలపై దృష్టి సారించామని అన్నారు. గత ప్రభుత్వం ఇసుకను ఆదాయ వనరుగా మార్చుకుంది మండిపడ్డారు.

ఇసుక రవాణాలో అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వర్షాలు పడినా కూడా ఇసుక పంపిణీకి ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. సాంకేతిక సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News