Big Stories

Free RTC Bus Ride in AP: ఏపీ మహిళలకు శుభవార్త.. ఫ్రీ బస్సు జర్నీ వివరాలను వెల్లడించిన మంత్రి!

Free RTC Bus for Women in AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలకు మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి శుభవార్త చెప్పారు. నెలలోగా మహిళలకు ఆర్టీసీ ద్వారా ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామంటూ ఆయన పేర్కొన్నారు. ఆదివారం సచివాలయంలోని నాలుగో బ్లాక్ లో ఉన్న ఛాంబర్ లో ఆయన రవాణా, క్రీడల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆర్టీసీ సిబ్బందికి మెరుగైన శిక్షణ ఇచ్చే ట్రైనింగ్ సెంటర్ల ఏర్పాటుకు సంబంధించిన ఫైల్ పై తొలి సంతకం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

- Advertisement -

ప్రమాద రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు. తన 11 ఏళ్ల వయసులో రోడ్డు ప్రమాదంలో తన తండ్రిని కోల్పోయానంటూ.. ప్రమాదాల్లో కుటుంబ సభ్యుడిని కోల్పోతే ఆ కుటుంబం పడే బాధ ఏంటో తనకు తెలుసన్నారు. తనకు వచ్చిన దు:ఖం ఏ కుటుంబానికీ రాకూడదన్నారు. రాష్ట్రంలో ప్రమాదాల నివారణకు ఏం చర్యలు తీసుకోవాలో వాటిని ఖచ్చితంగా తీసుకుంటామంటూ హామీ ఇచ్చారు.

- Advertisement -

ఆర్టీసీలో ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి సారించినట్లు మంత్రి చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ఒక్కటంటే ఒక్కటి కూడా కొత్త బస్సు కొనలేదన్నారు. ఉన్న బస్సులనే యథావిథిగా కొనసాగించారన్నారు. ఆర్టీసీ మనుగడ కాపాడేందుకు తాను కృషి చేస్తానంటూ మంత్రి హామీ ఇచ్చారు. ఆర్టీసీలో రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులను ప్రవేశపెడతామన్నారు. ఆర్టీసీ ఉద్యోగులతోపాటు ప్రయాణికులను కాపాడుకునే బాధ్యత తమపై ఉందని ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో పూర్తిగా విలీనం చేస్తామన్నారు. గత ఐదేళ్లలో ఆర్టీసీ స్థలాలను కొందరు కాజేశారని పేర్కొన్న మంత్రి, ఆ స్థలాలను వెనక్కి తీసుకుంటామన్నారు.

Also Read: “రాష్ట్రం నీ తాత జాగీరా” : జగన్ పై మంత్రి లోకేశ్ ఆగ్రహం

ఫ్రీ బస్సు జర్నీపై ఇప్పటికే కసరత్తు ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఉచిత బస్సు సౌకర్యంపై త్వరలోనే సమీక్ష నిర్వహిస్తామన్నారు. ఫ్రీ బస్సు సౌకర్యం కల్పిస్తే ఎదురయ్యే సమస్యలపై చర్చిస్తామన్నారు. మరో నెలరోజుల్లో ఫ్రీ బస్సు జర్నీ పథకాన్ని అమలు చేసి తీరుతామన్నారు. ఎటువంటి సమస్య తలెత్తకుండా రాష్ట్రంలో ఫ్రీ బస్సు జర్నీని విజయవంతంగా అమలు చేస్తామంటూ ఆయన తెలిపారు.

అదేవిధంగా రాష్ట్రంలో క్రీడా వసతులను మెరుగుపరుస్తామన్నారు. ప్రతిభ కనబరిచే క్రీడాకారులను ప్రోత్సహిస్తామంటూ హామీ ఇచ్చారు. ప్రతిదానికీ అకౌంటబులిటీతో పారదర్శకంగా పరిపాలన కొనగిస్తామని తెలియజేశారు. గత ప్రభుత్వంలో క్రీడల పేరిట నేతలు తిన్న డబ్బంతా కక్కిస్తామన్నారు. తనకు 3 శాఖలను కేటాయించిన సీఎం చంద్రబాబుకు రామ్ ప్రసాద్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. గత ప్రభుత్వం ఐదేళ్లపాటు ప్రజల రక్తమాంసాలు తిన్నదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను ఏనాడు పట్టించుకోలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News