Big Stories

Jaya Badiga: యూఎస్ లో జడ్జిగా ఏపీ మహిళ.. తెలుగులో ప్రమాణ స్వీకారం చేసి..

Jaya Badiga: భారత దేశ కీర్తి పతాకాన్ని ప్రపంచ వీధుల్లో ఎగురవేసి తెలుగువారు చరిత్ర సృష్టిస్తున్నారు. తాజాగా భారత సంతతికి చెందిన జయ బాడిగ అమెరికాలోని కాలిఫోర్నియా శాకమెంటో కోర్టులో జడ్జిగా నియమితులయ్యారు. అయితే ఆమె ప్రమాణ స్వీకారం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

- Advertisement -

కాలిఫోర్నియా కోర్టులో న్యాయమూర్తిగా జయ నియమితులయ్యారు. అయితే ఇలాంటి అత్యున్నత పదవి అలంకరించిన తొలి తెలుగు మహిళగా జయ చరిత్ర సృష్టించారు. అయితే ఆమె ప్రమాణ స్వీకారం కూడా ఓ సంచలనంగా మారింది. భారతీయ మూలాలు ఉన్న ఆమె సంస్కృత శ్లోకాలు పఠిస్తూ..జడ్జిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈ సంఘటన అక్కడ ఉన్న పలువురుని ఆశ్యర్చపోయేలా చేసింది. అంతే కాకుండా ఆమె సభను ఉద్దేశించి మాతృ భాషలో మాట్లాడారు. ఎక్కడికి వెళ్లినా మన మూలాలు మరిచిపోవద్దనే విషయాన్ని ఆమె చాటి చెప్పారు.

- Advertisement -

Also Read: కౌంటింగ్ కాడికి పోవొద్దు.. మీడియాలో మాట్లాడొద్దు: హైకోర్టు

జయ బాడిగ సభను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా 80 మిలియన్లకు పైగా మాట్లాడే భాష అయిన తెలుగులో మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం అని తెలిపారు. ఆమె ప్రసంగం పూర్తయిన తర్వాత అక్కడ ఉన్న వారంతా ఆమెను ప్రశంసించారు.

ఏపీలోని విజయవాడలో పుట్టిన జయ బాడిగ హైదరాబాద్ లో పెరిగారు. ఆ తర్వాత కుటుంబంతో కలిసి అమెరికా వెళ్లి అక్కడ స్థిరపడ్డారు. అక్కడే ఆమె న్యాయవిద్యను అభ్యసించారు. అయితే ఆమె గత రెండేళ్లుగా కమిషనర్ గా సేవలంచిన కోర్టులోనే జడ్జిగా నియమితురాలయ్యారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News