Big Stories

Ex Minister Roja scam 100 crores: రోజా.. ఆటల పేరుతో 100 కోట్ల స్కామ్, సీఐడీకి ఫిర్యాదు..

Ex Minister Roja scam 100 crores(Andhra politics news): ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం  ఏర్పడింది. కూటమి ఆధ్వర్యం లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. గడిచిన ఐదేళ్లలో జరిగిన కుంభకోణాలపై సీఐడీకి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ ఫైర్ బ్రాండ్ అనగానే ఠక్కున గుర్తుకొచ్చే నేత రోజా. ఈమె మాటలకు ప్రత్యర్థులు సైతం సైలెంట్ అయిపోయారు. అదంతా వైసీపీ సర్కార్‌లో మాత్రమే. గత ప్రభుత్వంలో ఓ వెలుగు వెలుగారామె.

- Advertisement -

ఇప్పుడు ఏపీలో ప్రభుత్వం మారింది. కౌంటింగ్ మొదలు ఇప్పటివరకు మాజీ మంత్రి రోజా మచ్చుకైనా కనిపించడం మానేశారు. తాజాగా ఆడుదాం ఆంధ్ర పేరుతో ఊరూ వాడా పోటీలను నిర్వహించారామె. క్రీడా రత్నాలు బయటకు తీసేందుకు ఈ కార్యక్రమం ఎంతగానే ఉపయోగపడిందని అప్పట్లో చెప్పకొచ్చారామె. ఇంతవరకు అంతా బాగానే ఉంది.

- Advertisement -

తాజాగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం పేరిట మాజీ మంత్రి రోజా వంద కోట్ల నొక్కేశారంటూ ఆరోపణలు వెల్లువెత్తున్నాయి.  ఈక్రమంలో రాష్ట్ర ఆత్యా-పాత్యా సంఘం సీఈవో ప్రసాద్ సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఈ ప్రొగ్రాంలో 100 కోట్ల మేరా కుంభకోణం జరిగిందని, అప్పటి మంత్రి రోజా, శాప్ మాజీ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిలు దీనికి సూత్రదారులు పేర్కొన్నారు.

ALSO READ:  జగన్ ఇంకా మారకపోతే.. వైసీపీ ఉనికికే ప్రమాదం !

అంతేకాదు అప్పటి శాప్ అధికారులతోపాటు అన్ని జిల్లాల డీఎస్‌డీవోలపై విచారణ చేపట్టాలని ఫిర్యాదు ప్రస్తావించారాయన. దీనికితోడు క్రీడాకారుల కోటా కింద మెడికల్, ఇంజనీరింగ్, ట్రిపుల్ ఐటీ ప్రవేశాలు పొందినవారిపైనా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు ప్రసాద్. అప్పటి కార్యక్రమానికి సంబంధించిన పేపర్స్‌ను సీజ్ చేయాలని కోరారు. శాప్‌కి సంబంధించి అధికారులు చేపట్టన పనుల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయని వాటిని పరిశీలించాలన్నారు. ఈ వ్యవహారంపై సీఐడీ వెర్షన్ ఏంటన్నది తెలియాల్సివుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News