Big Stories

Ex CM Jagan: మాజీ సీఎం జగన్ సంచలన ట్వీట్.. టీడీపీ కౌంటర్

Ex CM Jagan latest tweet on TDP(AP political news): గుంటూరు జిల్లా తాడేపల్లిలో కొత్తగా నిర్మిస్తున్న వైసీపీ సెంట్రల్ ఆఫీస్ కార్యాలయన్ని తెల్లవారుజామున 5 గంటల తర్వాత కూల్చివేశారు. నిర్మాణంలో వైసీపీ కార్యాలయ భవనాన్ని సీఆర్డీయే అధికారులు ప్రొక్లెయినర్లు, బుల్డోజర్లతో కూల్చి వేసే ప్రక్రియను మొదలుపెట్టగా.. ఉదయం 9 గంటలకు పూర్తిగా కూల్చివేశారు. అయితే ఈ ఘటనపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు.

- Advertisement -

హైకోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేయడంతోపాటు కోర్టు ధిక్కరణకు ప్రభుత్వం పాల్పడుతుందని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై హైకోర్టు దృష్టికి తీసుకెళ్తామని వైసీపీ నేతలు అంటున్నారు. తాజాగా, వైసీపీ కార్యాలయం కూల్చివేతపై ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ ఎక్స్ వేదికగా స్పందించారు.

- Advertisement -

జగన్ ట్వీట్..
‘ఏపీలో రాజకీయ కక్ష్య సాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరోస్థాయికి తీసుకెళ్లారు. ఒక నియంలా తాడేపల్లిలో దాదాపు పూర్తికావొచ్చిన వైసీపీ సెంట్రల్ కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారు. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేశారు. రాష్ట్రంలో చట్టం, న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయి. ఎన్నికల తర్వాత చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలతో రక్తాన్ని పారిస్తున్న చంద్రబాబు, ఈ ఘటన ద్వారా ఈ ఐదేళ్లపాటు పాలన ఏ విధంగా ఉండబోతుందనే హింసాత్మక సందేశాన్ని ఇవ్వకనే ఇచ్చారు. ఈ బెదిరింపులకు, ఈ కక్ష్య సాధింపు చర్యలకు వైసీపీ తలొగ్గేది లేదు, వెన్ను చూపేది అంతకన్నా లేదు. ప్రజల తరఫఉన, ప్రజల కోసం, ప్రజలతోడుగా గట్టిపోరాటాలు చేస్తాం. దేశంలోని ప్రజాస్వామ్య వాదులంతా చంద్రబాబు దుశ్చర్యల్ని ఖండించాలని కోరుతున్నాను.’ అంటూ జగన్ ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చారు.

టీడీపీ కౌంటర్..
తాడేపల్లిలో వైసీపీ కార్యాలయం కూల్చివేతపై జగన్ చేసిన ట్వీట్‌కు టీడీపీ కౌంటర్ ఇచ్చింది.
‘ప్రజల తాగునీటి అవసరాలకు ఉపయోగపడే వాటర్ ప్లాంట్ కట్టకుండా,మత్స్యకారుల భూమి ఆక్రమించి, కబ్జా చేసి కట్టామని, సిగ్గు వదిలేసి చెబుతున్నాడు. ప్రజల ఆస్తులు కొల్లగొడుతూ, నీ కబ్జాలు, నీ ఆక్రమణలు, నీ విలాసవంతమైన ప్యాలెస్‌లు వదిలేయమంటావా? ఇంత పెద్ద పెద్ద డైలాగులు వద్దులే కానీ, ముందు అసెంబ్లీకి వచ్చి పోరాడు’. అని జగన్‌ను ట్యాగ్ చేసింది. మరోవైపు టీడీపీ నేతలు సైతం కౌంటర్ ఇస్తున్నారు. ‘ప్రభుత్వ భూమిలో మీ అక్రమ నిర్మాణాలను అధికారులు సరైన విధానంలోనే వ్యవహరిస్తున్నారని, మీలా కాకుండా, ప్రజా మౌళిక సదుపాయలను ఎప్పటికీ కూల్చి వేయదు. ప్రజలు భూమిని లాక్కున్నారు. మీ కబ్జాలను వదిలేయమని అడుగుతున్నారా? అని జగన్‌ను ట్యాగ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News