Big Stories

Jagan: స్పీకర్ స్థానంలో అయ్యన్నపాత్రుడు.. సభకు రాకూడదని జగన్ నిర్ణయం

Ex- CM Jagan decision: ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గా నర్సీపట్నం ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం ఆయన స్పీకర్ గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో శాసనసభకు రాకూడదని వైసీపీ నిర్ణయించింది. స్పీకర్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి దూరంగా ఉండాలని మాజీ సీఎం వైఎస్ జగన్ భావించినట్టు తెలుస్తోంది.

- Advertisement -

నూతనంగా ఎన్నికైన స్పీకర్ ను అధికార, విపక్ష నేతలు ఆయన స్థానంలో కూర్చోబెట్టడం సంప్రదాయంగా వస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఎప్పట్నుంచో వస్తున్నటువంటి ఈ ఆనవాయితీకి జగన్ తిలోదకాలిచ్చినట్లు కానున్నది. రేపు ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి పులివెందుల వెళ్లనున్నారు. మూడురోజులపాటు జగన్ అక్కడ ప్రజలకు అందుబాటులో ఉంటారని వైసీపీ వర్గాలు వెల్లడించారు.

- Advertisement -

అయితే, గత వైసీపీ ప్రభుత్వంపై అయ్యన్నపాత్రుడు తీవ్ర స్థాయిలో మండిపడేవారు. ఆ ప్రభుత్వం చేస్తున్న తప్పులను, నాయకుల తీరును ఎప్పటికప్పుడు ఎండగడుతూ వచ్చేవారు. వైసీపీ నేతల వ్యాఖ్యలపై ఘాటుగా స్పందిస్తూ ప్రతి విమర్శలు చేసేవారు. అంతేకాదు.. ఆయనపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. ఈ క్రమంలోనే జగన్.. ఈ కార్యక్రమానికి దూరంగా ఉంటున్నారేమో అంటూ చర్చ జరగుతుంది.

Also Read: టీడీపీలో ఎవరున్నా హీరోలే.. బయటకు వెళ్తే జీరోలు: బుద్ధా వెంకన్న

కాగా, ఏపీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను సాధించి రికార్డు సృష్టించాలనుకున్న వైసీపీ కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమయ్యింది. కూటమి భారీ విజయం సాధించింది. కూటమిలోని జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ గెలుపొందింది. బీజేపీకి 8 సీట్లు వచ్చాయి. మిగతా సీట్లలో టీడీపీ విజయకేతనం ఎగురవేసింది. రాష్ట్ర ముఖ్యంత్రి చంద్రబాబు ప్రమాణస్వీకారం చేశారు. సచివాలయంలో పదవీ బాధ్యతలు కూడా స్వీకరించారు. మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేసి పదవీ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News