Big Stories

Case on Ex MLA Dwarampudi: అనుకోకుండా వచ్చిన ద్వారంపూడి, ఆపై కేసు నమోదు..

Case on Ex MLA Dwarampudi(AP political news): కొందరు రాజకీయ నాయకులు పోలీస్ వ్యవస్థను గుర్తించరు. చట్టానికి తాము అతీతులమని వ్యవహరిస్తారు. అందుకే పోలీసులంటే భయం, గౌరవం ఉండవు. కబ్జాలు చేస్తారు.. సామాన్యుల మీద దౌర్జన్యం చేస్తారు. రోజులెప్పుడు ఒకేలా ఉంటాయా.. ఒక్కోసారి రివర్స్ అవుతాయి కూడా.

- Advertisement -

తాజాగా కాకినాడ వైసీపీ మాజీ ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి అందుకు ఉదాహరణ. అక్రమ కట్టడాలు కూల్చివేతలకు అడ్డంగా వచ్చారు.. అనుకోకుండా బుక్కైపోయారు.. కేసు కూడా నమోదు చేశారు పోలీసులు. జూలై రెండున కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలోని రాజ్యలక్ష్మి‌నగర్‌లో అక్రమ కట్టడాలపై  అధికారులు కొరడా ఝులిపించారు. ద్వారంపూడి అనుచరుడు సూరిబాబు అక్రమంగా కడుతున్న భవనాలను కూల్చివేయడం మొదలుపెట్టారు.

- Advertisement -

ఈ విషయం తెలియగానే మాజీ ఎమ్మెల్యే అక్కడికి పట్టరాని ఆవేశంతో దూసుకొచ్చారు. ఈ సమయంలో అధికారుల విధులకు ఆటంకం కలిగించారు. చంద్రశేఖర్‌రెడ్డి, ఆయన అనుచరులు. అంతేకాదు అధికారులతో గొడవకు దిగి రెచ్చగొట్టేలా వ్యవహరించారు. అంతేకాదు సిబ్బందిపై దాడులకు యత్నించి నట్టు పోలీసులకు ఫిర్యాదు అందాయి. అసలే ప్రభుత్వం మారింది.. పోలీసులు ఊరుకుంటారా? ఫిర్యాదు చేయగానే వెంటనే కేసు నమోదు చేశారు కాకినాడ పోలీసులు.

ALSO READ: టీడీపీ ఆఫీసు ధ్వంసం కేసు, అప్పిరెడ్డి ముందస్తు బెయిల్ కోసం..

ఏ-1గా ద్వారంపూడి, ఏ-2గా సూరిబాబులతోపాటు మరో 24 మందిపై కేసు కట్టేశారు పోలీసులు. ఎన్నికల్లో ఓటమి తర్వాత కార్యకర్తలతో సమావేశమయ్యారు ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి. ప్రభుత్వం మారింది.. ఇకపై చాలా జాగ్రత్తగా ఉండాలని అనుచరులకు చిన్నపాటి హెచ్చరిక చేశారాయన. తాను కూడా దూరంగా ఉండాలని అనుకున్నారు. కూల్చివేతల విషయం తెలియగానే ఆయన ఆవేశానికి లోనై ఎంట్రీ ఇచ్చారు. తమను ఆవేశపడవద్దని, మా నేత ఎందుకు ఇలా చేశారని అనుచరులు చెప్పుకోవడం గమనార్హం.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News