BigTV English

Pawan Kalyan: పవన్‌కు ప్రాణహాని ఉందా..? సానుభూతి కోసం ప్రయత్నం చేస్తున్నారా?

Pawan Kalyan: పవన్‌కు ప్రాణహాని ఉందా..? సానుభూతి కోసం ప్రయత్నం చేస్తున్నారా?


Pawan Kalyan latest news(Andhra pradesh today news) : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు ప్రాణహాని ఉందా? పవన్ కల్యాణ్ హత్యకు ప్లాన్ చేస్తున్నారా? ప్రతి సభలోనూ అదే అంశాన్ని పవన్ ఎందుకు ప్రస్తావిస్తున్నారు. వారాహి యాత్రలో తన భద్రత అంశాన్ని పదేపదే ఎందుకు తెరపైకి తెస్తున్నారు. ఈ అంశాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. తనకు ప్రాణ హాని ఉందంటూ సింపథీ కోరుకునే ప్రయత్నం చేస్తున్నారా? అసలు పవన్ ఏం కోరుకుంటున్నారు..? బీజేపీతో పొత్తులో ఉన్నప్పటికీ తన భద్రతాంశాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నారు? అనే అంశాలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.

కేంద్ర హోంమంత్రి అమిత్ షాను అడిగితే పవన్‌కు భద్రత ఇవ్వరా? అసలు పవన్‌ను చంపాలని సుపారీ ఇవ్వాల్సిన అవసరం ఎవరికి ఉంది? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గతంలో జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇస్తామంటే ఎందుకు వద్దనుకున్నారు? అధికార వైఎస్సార్ సీపీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారా? వారాహి యాత్రలో పొరపాటున ఏదైనా చిన్న ఘటన జరిగితే..తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తారా? ఇలా అనే సందేహాలు వస్తున్నాయి.


సరిగ్గా 2019 ఎన్నికలకు ముందు వైజాగ్ ఎయిర్ పోర్టులో జగన్‌పై కోడి కత్తి దాడి జరిగింది. ఆ దాడి ద్వారా జగన్‌కు ఎన్నికల్లో విపరీతమైన సింపథీ వచ్చింది. 2004 ఎన్నికలకు ముందు అలిపిరిలో చంద్రబాబుపై దాడి జరిగింది. ఆ దాడి ద్వారా వచ్చిన సానుభూతితో ముందస్తుకు వెళ్లి చంద్రబాబు భంగపడ్డారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ అదే బాటలో నడుస్తున్నారా? అని పొలిటికల్ సర్కిల్స్‌లో ఇదే చర్చ జరుగుతోంది.

Related News

Pulivendula ZP: పులివెందుల జెడ్పీ.. ఆ ముగ్గురు వ్యూహం, బెడిసికొట్టిన వైసీపీ ప్లాన్

Jagan: కూలిపోతున్న పులివెందుల కోట.. తప్పు ఎక్కడ జరిగింది? టెన్షన్‌లో జగన్‌

Viveka Murder Case: వివేకా హత్యకేసు విచారణలో కీలక మలుపు..

ZPTC Fightings: భగ్గుమన్న పులివెందుల.. మంత్రి ఎదుటే కొట్టుకున్న టీడీపీ, వైసీపీ కార్యకర్తలు

Pulivendula ZPTC: పులివెందుల, ఒంటమిట్టలో ముగిసిన పోలింగ్

AP Free Bus Scheme: ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం – స్త్రీశక్తి పథకంపై సీఎం సమీక్ష

Big Stories

×