BigTV English

Pawan Kalyan: పవన్ చెప్పిన ‘ఉప్మా’ కథ.. వింటే అవాక్కవ్వాల్సిందే..

Pawan Kalyan: పవన్ చెప్పిన ‘ఉప్మా’ కథ.. వింటే అవాక్కవ్వాల్సిందే..
pawan kalyan speech

Pawan kalyan speech today live(Andhra news updates) : వారాహి విజయ యాత్రలో జనసేనాని ఓ ఆసక్తికర కథ చెప్పారు. ఆ కథలో ఎంతో లాజిక్ ఉంది. ఓ హాస్టల్‌లో ఉప్మా కథను.. రాజకీయాలకు అన్వయించి చెప్పడం ప్రజలను ఆకట్టుకుంది.. ఆలోచింపచేస్తోంది.


అనగనగా ఓ హాస్టల్. సుమారు 100 మంది స్టూడెంట్స్. అందులో కేవలం 18శాతం మందికి ఉప్మా అంటే నచ్చుతుంది. మిగతా 82శాతం స్టూడెంట్స్‌కి ఉప్మా అంటే అస్సలు ఇష్టం ఉండదు. అయితే, పదే పదే ఉప్మానే పెడుతుండటంతో.. వారంతా వార్డెన్ దగ్గరికి వెళ్లి ప్రశ్నించారు.

అయితే, ఎవరికి ఏ టిఫిన్ కావాలో చెప్పండంటూ ఓటింగ్ నిర్వహించాడు ఆ హాస్టల్ వార్డెన్. ఓ ఓటింగ్‌లో కొందరు పూరి, మరికొందరు దోశ, ఇంకొందరు ఇడ్లీ.. వడ.. ఊతప్పం.. కిచిడీ.. ఇలా తమకు ఇష్టమైన టిఫిన్లను చీటీ మీద రాశారు. ఉప్మా లవర్స్ మాత్రం.. మొత్తానికి మొత్తంగా ఉప్మా అని రాశారు. ఇక్కడే ఉంది ట్విస్ట్ అంతా.


ఉప్మాకు ఓటేసిన వాళ్లు 18శాతం ఉంటే.. మిగతా టిఫిన్ల కోసం విద్యార్థులంతా చీలిపోయారు. అలా ఎవరికివారే వేరే వేరు టిఫిన్ల పేర్లు రాయడంతో.. ఉప్మా వ్యతిరేకులు అధిక సంఖ్యలో ఉన్నా.. ఏ టిఫిన్‌కూ 18శాతం మెజార్టీ రాలేదు. చివరాఖరికి 18శాతం ఓటింగ్‌లో ఉప్మానే గెలిచింది. హాస్టల్‌లో మళ్లీ ఉప్మానే పెడుతున్నారంటూ.. ఆసక్తికర కథ చెప్పారు పవన్ కల్యాణ్.

సేమ్ టు సేమ్ ఏపీ రాజకీయాల్లోనూ అలానే జరుగుతోందని అన్నారు. రాష్ట్రంలో 75 శాతం మంది ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని చెప్పారు. ఆ 75శాతం మంది ఉమ్మడిగా ఉండాలని.. వచ్చే ఎన్నికల్లో అనైక్యతను జయించాలని.. లేదంటే మళ్లీ వైసీపీ ప్రభుత్వమే వచ్చి తీరుతుందని వివరించి చెప్పారు. వైసీపీ వ్యతిరేకులంతా ఎవరికి వారే విడిపోయి ఓట్లు వేయకుండా.. అంతా అధికార పార్టీకి వ్యతిరేకంగా ఐక్యం కావాలని.. ముమ్మిడివరం వారాహి యాత్రలో స్టోరీ వినిపించారు జనసేనాని పవన్ కల్యాణ్.

Related News

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Big Stories

×