Big Stories

Court Allowed Pinnelli to Police Custody: పోలీస్ కస్టడీకి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. కోర్టు అనుమతి

Pinnelli Ramakrishna reddy news(AP news live): ఏపీలో ఎన్నికల సమయంలో ఈవీఎం ధ్వంసం కేసులో అరెస్టై నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కస్టడీలోకి తీసుకునేందుకు న్యాయస్థానం పోలీసులకు అనుమతి ఇచ్చింది. అదనపు విచారణ కోసం పోలీసులు కస్టడీకి ఇవ్వాలని కోరగా మాచర్ల కోర్టు అందుకు అంగీకరించింది. దీంతో పిన్నెల్లిని రెండు రోజులపాటు పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు.

- Advertisement -

అయితే, పోలీసులు నాలుగురోజుల కస్టడీకి అనుమతి కోరగా కోర్టు రెండురోజుల కస్టడీకి మాత్రమే అనుమతి ఇచ్చింది. ఒక్కొక్క కేసులో ఒక్కొక్క రోజు చొప్పున.. రెండు రోజుల పాటు పోలీసులు విచారణ చేసేందుకు న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పిన్నెల్లిని నెల్లూరు జైలులో సీసీ కెమెరాలు, పిన్నెల్లి తరఫు న్యాయవాదుల సమక్షలో విచారణ చేసేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఓ డీఎస్పీ స్థాయి అధికారి, ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి విచారణ చేయొచ్చని పేర్కొంటూ అనుమతినిచ్చింది న్యాయస్థానం.

- Advertisement -

Also Read: ఎమ్మెల్సీలుగా రామచంద్రయ్య, హరిప్రసాద్ ఏకగ్రీవ ఎన్నిక

మే 13న పోలింగ్ రోజు మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రెచ్చిపోయారు. రెంటచింతల మండలం పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఈవీఎంను ధ్వంసం చేశారు. అంతేకాదు.. ఈవీఎంను ధ్వంసం చేయడంతో పిన్నెల్లిని అక్కడే ఉన్న నాగశిరోమణి అనే మహిళ ప్రశ్నించింది. ఆమెను కూడా పిన్నెల్లి తీవ్రంగా హెచ్చరిస్తూ దుర్భాషలాడారు. దీనిపై రెంటచింతల పోలీసులు 506, 509 సెక్షనల్ కింద కేసు నమోదు చేశారు.

Also Read: గత ప్రభుత్వం అసెంబ్లీ భవనాలకు సున్నం కూడా వేయలేదు: స్పీకర్ అయ్యన్న

ఈవీఎం ధ్వంసం చేయడాన్ని అడ్డుకోబోయిన టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావుపై దాడి చేశారు. దీనిపై అతనితోపాటు మరో 15 మందిపై పలు సెక్షన్ల కింద రెంట చింతల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యింది. తనను చంపేయాలని పిన్నెల్లి వైసీపీ శ్రేణులను ఉసిగొల్పినట్టు శేషగిరిరావు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో పిన్నెల్లిని ఏ-1గా చేర్చారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News