Big Stories

CM Chandrababu to visit Rushikonda: లోగుట్టు బయటకు, వచ్చేవారం రుషికొండకు సీఎం చంద్రబాబు! మాయా‌మహల్ సందర్శన..

CM Chandrababu to visit Rushikonda: విశాఖలో రుషికొండ మహల్ లోగుట్టు బయటకు వచ్చింది. దాదాపు రెండేళ్లపాటు గుట్టుచప్పుడుగా వైసీపీ ప్రభుత్వం సాగించిన నిర్మాణాలను టీడీపీ ప్రభుత్వం బయటపెట్టింది.

- Advertisement -

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు రుషికొండ బిల్డింగ్స్ గురించే చర్చించుకుంటున్నారు. రుషికొండ ప్యాలెస్ అద్భుతం, ఇందులో ఉండే భాగ్యం ఎవరికి వస్తుందని చర్చించుకోవడం మొదలైంది.

- Advertisement -

రుషికొండ నుంచి విషయాలు బయటకు వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబునాయుడు సందర్శించేందుకు రెడీ అవుతున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే వచ్చేవారం విశాఖ వెళ్లి రుషికొండలో ఉన్న ఖరీదైన భవనాలు సందర్శించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

CM Chandrababu to visit Rushikonda buildings
CM Chandrababu to visit Rushikonda buildings

రుషికొండపై భవనాలకు 452 కోట్ల వ్యయంతో నిర్మించనున్నారు. ఇప్పటికే కేవలం 407 కోట్ల మాత్రమే ఖర్చు చేశారు. ఇందులో సదుపాయాల గురించి చెప్పనక్కర్లేదు. దాదాపు 10 వేల ఏకరాల్లో భారీ భవనాలను నిర్మించారు.

Rushikonda buildings
Rushikonda buildings

ముఖ్యంగా దాదాపు 500 మంది సరిపోయే విధంగా భారీ సమావేశ మందిరం ఉంది. ముఖ్యమైన చీఫ్ గెస్టులతో మాట్లాడుకునేందుకు 200 మంది కూర్చొనేందుకు వీలుగా హోం థియేటర్ లేకపోలేదు. అంతర్గత అలంకరణ వస్తువులు, ఫర్మిచర్ కోసం కేవలం 30 కోట్ల రూపాయలను పైగానే కేటాయించారట.

Rushikonda buildings bathrooms
Rushikonda buildings bathrooms

భవనాల బయట సముద్రం వ్యూ, సుందరమైన ల్యాండ్ స్కేపింగ్, ఉద్యానవనాన్ని సుందరంగా తీర్చి దిద్దారు. విశాలమైన పడకగదులు, వాటికి తీసిపోని విధంగా స్నానాల గదులు, అత్యంత ఖరీదైన మంచాలు, పరుపులు, బాత్ టబ్‌లు, కళ్లు జిగేలుమనేలా షాండ్లియర్లు ఈ భవనాల సొంతం.

Rushikonda buildings inside
Rushikonda buildings inside

అంతర్గత అలంకరణ కోసం ఏకంగా 1312 రకాల వస్తువులను ఉపయోగించారు. విదేశాల నుంచి తీసుకొచ్చిన పాలరాయిని ఇందులో వినియోగించుకున్నట్లు అక్కడి వర్కర్లు చెబుతున్నారు.భవనాల బయట సముద్రం వ్యూ, సుందరమైన ల్యాండ్ స్కేపింగ్, ఉద్యానవనాన్ని సుందరంగా తీర్చిదిద్దారు.

Rushikonda buildings inside equipment
Rushikonda buildings inside equipment

ఇక పడక గదిలో లేత రంగులతో మెరిసిపోయే అత్యంత విలాసవంతమైన మంచం, అందుకు తగినట్టుగా ఖరీదైన కుర్చీలు, టేబుల్, వర్కింగ్ టేబుల్ వంటివి ఏర్పాటు చేశారు. మొత్తం 12 గదుల్లో వేర్వేరు రకాల మంచాలు ఏర్పాటు చేశారు. ఈ గదులకు చుట్టూ ఆటోమేటిక్ అద్దాల తలుపులు, బయటి నుంచి ఎండ లోపలికి రాకుండా ఆటోమేటిక్ కర్టెన్లు కొలువుదీరాయి.

లోపల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువ. వాటిని బ్రిటన్ రాణి నివాసంతో పోల్చుతున్నారు. ఇందుకోసం విదేశాల నుంచి ఇంటీరియల్ డిజైనర్‌ని రప్పించి డెకరేషన్ చేయించినట్టు వార్తలు లేకపోలేదు. 480 చదరపు అడుగుల విస్తీర్ణంలో స్నానాల గదిని నిర్మించారు. ఇక బాత్ టబ్ గురించి మాట్లాడాల్సిన పనిలేదు. దీనికోసం దాదాపు 20 లక్షలు ఖర్చు చేసినట్టు సమాచారం.

Rushikonda buildings inside spa
Rushikonda buildings inside spa

వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఓ ఐఏఎస్ ద్వారా ఓ కమిటీ వేయించింది. రుషికొండపై భవనాలు ముఖ్యమంత్రి నివాసానికి అనుకూలమని సిఫార్సు చేయడం పెద్ద డ్రామాగా చెబుతున్నారు.

ALSO READ: తొలిసారి క్షేత్రస్థాయి టూర్.. సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు సందర్శన

దీనిపై వైసీపీ నేతలు కూడా తమదైనశైలిలో చెప్పుకొచ్చారు. విశాఖ సిటీకి రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్, ముఖ్యమంత్రులకు ఎవరొచ్చినా సరైన భవనం లేదని విషయాన్ని గుర్తించి వీటిని నిర్మించిందంటూ కొత్త భాష్యం చెప్పేసింది. వైసీసీయా మజాకా?

Rushikonda buildings inside bedroom walking way
Rushikonda buildings inside bedroom walking way

 

అసలే లోటుబడ్జెట్‌లో ఉన్న రాష్ట్రానికి ఇలాంటి భవనాలు అవసరమా అని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. ఇలాంటి రిసార్టులు కొనసాగించాలన్నా, వీటికి వచ్చే ఆదాయం కంటే, మెయింటెనెన్స్ ఎక్కువ ఖర్చు అవుతుందని లెక్కలు వేస్తున్నాయి. ఈ భవనాలను ఏవిధంగా ఉపయోగించాలో తెలియక సతమతమవుతున్నారు.

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News