Big Stories

White Paper on Amaravati : ఏపీ రాజధాని అమరావతిపై శ్వేతపత్రం విడుదల

CM Chandrababu Released White Paper on Amaravati : ఏపీ రాజధాని అమరావతిపై ముఖ్యమంత్రిపై నారా చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేశారు. గడిచిన ఐదేళ్లలో అమరావతికి జరిగిన నష్టంపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేసి.. ఆ నష్టాన్ని వివరించారు. అలాగే అమరావతిలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్ని వివరించారు.

- Advertisement -

బ్రిటీష్ మ్యూజియంలో అమరావతికి గ్యాలరీ ఉంది. రాష్ట్ర విభజన జరుగుతుందని ఎవరూ ఊహించలేదన్నారు సీఎం చంద్రబాబు. విభజన తర్వాత అమరావతే రాజధానిగా అవుతుందన్నది కూడా ఎవరూ అనుకోలేదని పేర్కొన్నారు. అమరావతికి ఎంతో సెంటిమెంట్ ఉందని, పవిత్ర దేవాలయాల్లోని మట్టిని తీసుకొచ్చి అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు వివరించారు.

- Advertisement -

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్, సికింద్రాబాద్ రెండు సిటీలుంటే.. మూడో సిటీ సైబరాబాద్ ను అభివృద్ధి జరిగింది తన హయాంలోనేనని పేర్కొన్నారు. హైదరాబాద్ కు నీళ్లు, కరెంట్ లేని రోజుల నుంచి.. అభివృద్ధి చేశామని చెప్పుకొచ్చారు. హైదరాబాద్ కు నీళ్లకోసం కృష్ణాజలాలను తీసుకొచ్చి చరిత్ర తిరగరాశామని చెప్పారు. అలాంటి అనుభవంతోనే అమరావతిని రాజధానిగా తీర్చిదిద్దాలని నిర్ణయించామన్నారు. రాష్ట్రంలో ఏ పక్క నుంచి చూసినా అమరావతి ప్రాంతమే మధ్యలో కనిపిస్తుందన్నారు. హైదరాబాద్ మాదిరిగానే అమరావతిని కూడా అభివృద్ధి చేస్తామన్నారు.

అమరావతిని రాజధానిగా తీర్చిదిద్దేందుకు ల్యాండ్ పూలింగ్ ఒక్కటే మార్గంగా కనిపించిందన్నారు. గతంలో అమరావతే రాజధానిగా ఉండాలన్న జగన్.. సీఎం అవ్వగానే మూడు రాజధానులంటూ అమరావతి అభివృద్ధిని పక్కన పెట్టేశాడన్నారు. సింగపూర్ మాదిరిగా అమరావతిని అభివృద్ధి చేసేందుకు అనేక కంపెనీలు ఫండ్స్ తో ముందుకొచ్చాయని తెలిపారు. గుడివాడ, చిలకలూరిపేట వంటి ఊళ్లను కలిపి క్యాపిటల్ రీజన్ కు ఇచ్చారన్నారు.

అమరావతిని స్మార్ట్ సిటీ ఆఫ్ ఇండియాగా తీర్చిదిద్దాలని అనుకున్నామని తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు. అలాగే వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్, ఎకానమిక్ పవర్ హౌస్, హైటెక్ అండ్ నాలెడ్జ్ బేస్డ్ ఇండస్ట్రీ జాబ్స్, గ్లోబల్లీ కాంపిటేటివ్, రిఫ్లెక్ట్ రిచ్ హెరిటేజ్ పొసెస్డ్ బై ది రీజియన్, షో కేస్ యూనిక్ ఐడెంటిటీ, సస్టైనబిలిటీ, ఎఫిషియంట్ మేనేజ్ మెంట్ ఆఫ్ రిసోర్సెస్ ఇవన్నీ అమరావతిలో.. చుట్టుపక్కల ప్రాంతాల్లో తీసుకొచ్చి డెవలప్ చేయాలని ప్లాన్ చేసినట్లు వివరించారు. ప్రపంచంలో అన్ని సిటీలకంటే అమరావతి బెస్ట్ సిటీగా ఉండాలని ఇవన్నీ ఆలోచించామన్నారు. వన్ ఆఫ్ ది బెస్ట్ అసెంబ్లీ, బెస్ట్ హైకోర్టు ఉండాలని కొత్త కాన్సెప్ట్ తెచ్చామన్నారు.

అసెంబ్లీ, హై కోర్టులతో పాటు.. అమరావతి అభివృద్ధిలో గ్రీనరీకి అధిక ప్రాధాన్యమిచ్చామన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో, ఏ సిటీలోనూ లేని రివర్ ఫ్రంట్ మనకు ఉందన్నారు. కృష్ణానది, గోదావరి ల అనుసంధానంతో తాజా నీటిని అందిస్తున్నామన్నారు. ఫలితంగా అనారోగ్యం ఉండదన్నారు.

అమరావతి అభివృద్ధి ఆగిపోవడంతో.. అన్ని రంగాలు దెబ్బతిన్నాయన్నారు. కూలిపనులు, పాచి పనులకు కూడా సొంతూళ్లను వదిలి హైదరాబాద్ బాట పట్టాల్సిన పరిస్థితి దాపరించిందన్నారు. యువతకు ఉద్యోగాలు లేకుండా పోయిందని, ఇదంతా గత పాలకుల అరాచకం వల్లేనన్నారు. హైదరాబాద్ నాలెడ్జ్ అకాడమీలోనే 7-10 లక్షల ఉద్యోగాలు వచ్చాయన్నారు. ఐటీ సెక్టార్ ఒకటి రెడీ అయితే అన్నిరకాల కంపెనీలు వచ్చేవని, అలాంటిది వైసీపీ వల్ల అవన్నీ ఆగిపోయాయన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News