Big Stories

CM Chandrababu family in Tirumala : శ్రీవారి సన్నిధిలో సీఎం చంద్రబాబు ఫ్యామిలీ, ప్రోటోకాల్, పరదాల విషయంలో..

CM Chandrababu family in Tirumala : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫ్యామిలీ గురువారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం ఎనిమిది గంటల సమయంలో సీఎం చంద్రబాబు ఫ్యామిలీ స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ వేద పండితులు దంపతులను ఆశీర్వదించారు. ఆలయ సమీపంలో పలు ప్రాంతాలను సందర్శించారు ముఖ్యమంత్రి. ఈ సందర్భంగా భక్తులతో మాట్లాడారు. అనంతరం అక్కడి నుంచి గాయత్రి నిలయం వద్దకు చేరుకోన్నారు. తిరుమల నుంచి నేరుగా విజయవాడకు చేరుకోనున్నారు.

- Advertisement -

అంతకుముందు బుధవారం రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు ఫ్యామిలీ రేణిగుంట ఎయిర్‌పోర్టులో దిగింది. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో తిరుమలకు చేరుకున్నారు ముఖ్యమంత్రి. మార్గం మధ్యలో వాహన శ్రేణిని ఆపి కార్యకర్తలకు అభివాదం చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు, అభిమానులు ముఖ్యమంత్రిని చూసేందుకు తరలివచ్చారు. ఆ సమయంలో వర్షం పడుతుండటంతో గొడుగులో అతిథి గృహానికి వెళ్లారు.

- Advertisement -

అయితే సీఎం పర్యటన సందర్భంగా అధికారులు వ్యవహరించిన తీరుపై ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. గాయత్రి నిలయం వద్ద సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు టీటీడీ అధికారులు ఎవరూ రాలేదు. వాహనం దిగి గాయత్రీ నిలయం లోపలికి వెళ్లిన తర్వాత పుష్పగుచ్ఛం ఇచ్చేందుకు టీటీడీ ఇన్‌ఛార్జ్ ఈవీ వీరబ్రహ్మం యత్నించగా.. ముఖ్యమంత్రి తిరస్కరించారు.

ALSO READ:  ఏపీ ప్రజలకు శుభవార్త చెప్పిన ప్రధాని మోదీ..

సీఎం చంద్రబాబు తిరుమల పర్యటనలో పరదాలు దర్శనమిచ్చాయి. పరదాలు ఏర్పాటు చేసిన అధికారులపై ముఖ్యమంత్రి సీరియన్ అయినట్టు తెలుస్తోంది. పాత పద్ధతులు వీడాలని హితవు పలికారు. వెంటనే వాటిని అధికారులు తొలగించారు. వెంటనే మంత్రి నారా లోకేష్.. మాట్లాడుతూ పరదాలు వద్దని తనదైనశైలిలో చెప్పారు.

 

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News