Big Stories

CM Chandrababu: జగన్ బొమ్మ ఉన్నా పర్లేదు.. కిట్లు పంపిణీ చేయండి : సీఎం చంద్రబాబు

CM Chandrababu: విద్యా కానుక కిట్లను త్వరితగతిన పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. స్కూల్ బ్యాగులపై పార్టీ గుర్తులు ఉన్నప్పటికీ వాటిని సైతం పంపిణీ చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం స్కూల్ బ్యాగులను పార్టీ రంగులతో ముద్రించినా వృథా చేయకుండా విద్యార్థులకు అందజేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. కాగా, ఏపీలో నేటి నుంచి పాఠశాలలు ప్రారంభమయ్యాయి. దీంతో పాఠశాలలకు హాజరయ్యే విద్యార్థులకు ఇబ్బంది ఉండకుండా బ్యాగుల అందజేయాలని చెప్పినట్లు తెలుస్తోంది.

- Advertisement -

పాఠశాలలకు ఆదేశాలు

- Advertisement -

నేటి నుంచి రాష్ట్రంలో పాఠశాలలు పున:ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ఇప్పటికే ప్రభుత్వం నుంచి పాఠశాలలకు ఆదేశాలు జారీ చేశారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై అధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో విద్యా కానుక ద్వారా అందాంచే కిట్లను ఎప్పటిలాగే విద్యా సంవత్సరం ప్రారంభం రోజే అందజేస్తున్నారు.

Also Read: పవన్ కాళ్లు మొక్కిన నారా లోకేష్.. నెట్టింట వీడియో వైరల్

విద్యా కానుకకు రూ.700 కోట్లు

ప్రభుత్వం విద్యా కానుక కిట్ల కోసం రూ.700 కోట్లు వెచ్చించింది. ఈ మేరకు ప్రభుత్వ పాఠశాలలో చదివే 36 లక్షల మంది విద్యార్థులకు విద్యా కానుక కిట్లు పంపిణీ చేయనున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల సమయంలో టెండర్లు పిలవడంతో స్కూల్ బ్యాగులపై గుర్తులు ముద్రించలేదని అధికారులు తెలిపారు. వాస్తవానికి బుధవారం పాఠశాలలు పున: ప్రారంభం కావాల్సి ఉండగా.. కొత్త ప్రభుత్వ ఏర్పాటుతో ఒకరోజు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. గత కొంతకాలంగా కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం రోజే విద్యా కానుక కిట్లు అందజేస్తుండడంతో కొత్త ప్రభుత్వం కూడా అలానే పంపిణీ చేస్తుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News