Big Stories

Chandrababu Kuppam House: చంద్రబాబు ఇంటి కోసం లంచం, డిప్యూటీ సర్వేయర్ సస్పెండ్

Chandrababu Kuppam House news(AP political news): ఏపీలో ప్రభుత్వ అధికారుల చేతికి ముడుపులు ఇస్తేగానీ పని జరగదు. అప్పుడే సంబంధించిన ఫైలు ముందుకు కదులుతుంది. ఇది గడిచిన ఐదేళ్లలో జరిగిన వ్యవహారం. అందుకు బాధితులు ఎవరో తెలుసా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. ఆయన ఇంటి స్థలాన్ని సబ్ డివిజన్ చేసేందుకు ఓ డిప్యూటీ సర్వేయర్ ఏకంగా లంచం తీసుకున్న వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

- Advertisement -

అసలేం జరిగిందన్న డీటేల్స్‌లోకి వెళ్తే.. వైసీపీ ప్రభుత్వంలో అప్పటి ప్రతిపక్షనేత టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలం కడపల్లె పంచాయతీ శివపురం ఇంటి కోసం ఓ స్థలాన్ని కొనుగోలు చేశారు. జాతీయ రహదారి పక్కనేఉన్న వ్యవసాయ భూమిలో ఇంటిని నిర్మాణం చేపట్టేందుకు టీడీపీ నేతలు దరఖాస్తు చేశారు.

- Advertisement -

భూ వినియోగ మార్పిడికి అప్లై చేశారు నేతలు. ఈ స్థలాన్ని సబ్ డివిజన్ చేయాలని కోరగా, అందుకు డిప్యూటీ సర్వేయర్ సద్దాంహుస్సేన్ తన చేతికి ముడుపులు ఇస్తేనే పని అవుతుందని ఓపెన్‌గా చెప్పేశాడు. దాదాపు లక్షా 80 వేల రూపాయలు డిమాండ్ చేశాడు. చివరకు చేసేదిలేక ఆ మొత్తాన్ని నేతలు సర్వేయర్ చేతికి ఇవ్వడంతో ఆ ఫైలు ముందుకు కదిలింది.

సీన్ కట్ చేస్తే.. నిన్నటి ఎన్నికల్లో టీడీపీ రూలింగ్‌లోకి వచ్చింది. జూన్ 25న తన నియోజకవర్గం కుప్పం వెళ్లారు సీఎం చంద్రబాబు. స్థానిక ఆర్ అండ్ బీ అతిధి గృహం వద్ద స్థానిక నేతల మధ్య ఈ విషయం చర్చకు వచ్చింది. ఈ విషయంపై కలెక్టర్ దృష్టి సారించడం ఆరాతీయడం జరిగిపోయింది. వెంటనే దీనిపై విచారణకు ఆదేశించారు.

ALSO READ: పెద్దిరెడ్డి, మిథున్‌రెడ్డి ఎర్ర చందనం స్మగ్లింగ్, నేపాల్ పోలీసులకు..

డిప్యూటీ సర్వేయర్ లంచం తీసుకున్న మాట నిజమేనని తేల్చారు. దీనిపై సాయంత్రానికి నివేదిక ఇవ్వాలని జాయింట్ కలెక్టర్.. ఏడీని ఆదేశించారు. ఆ వెంటనే డిప్యూటీ సర్వేయర్ సద్దాంహుస్సేన్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. సాక్షాత్తూ అప్పటి ప్రతిపక్ష నేతకి ఇలాంటి పరిస్థితి వస్తే.. సామాన్యుల మాటేంటని అంటున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News