Big Stories

Tdp govt focus on Tesla company: టెస్లాపై కన్నేసిన చంద్రబాబు సర్కార్, రంగంలోకి నారా లోకేష్, త్వరలో అమెరికాకు

TDP govt focus on Tesla company(AP news today telugu): ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడిదారులను రప్పించేందుకు ప్లాన్ చేస్తోంది చంద్రబాబు సర్కార్. దీనిపై పరిశ్రమల శాఖ అధికారులు ఓ డేటా రెడీ చేశారు. ఇందులోభాగంగా పలు కంపెనీలకు లేఖలు రాస్తున్నారు. ఈ క్రమంలో టెస్లా కంపెనీపై కన్నేసింది ఏపీ ప్రభుత్వం. ఈ వ్యవహారంపై చర్చించేందుకు మంత్రి నారా లోకేష్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రంగంలోకి దించినట్టు సమాచారం.

- Advertisement -

హైదరాబాద్ మాదిరిగానే ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ పటంలో పెట్టాలని భావిస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. కియో ద్వారా ఏపీకి కొంత గుర్తింపు వచ్చినప్పటికీ, ఆ తరహా కంపెనీ మరొకటి వస్తే బాగుంటుందని ఆలోచన చేస్తున్నారు. భారీ పరిశ్రమ వస్తే అభివృద్ధి చెందడమేకాదు, ఎగుమతులను హబ్‌గా మారుతుందని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ఎలక్ట్రానిక్ వాహనాల-ఈవీ తయారీ కంపెనీలకు లేఖలు రాస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అనువైన వాతావరణాన్ని వివరిస్తున్నారు.

- Advertisement -

కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్న సంస్థల వివరాలను ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు సేకరించింది. సుమారు 75 సంస్థల వివరాలను సిద్ధం చేసినట్టు అంతర్గత సమాచారం. ఆయా సంస్థల యాజమాన్యాలతో ఏపీ ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. అమెరికా, యూరప్‌తోపాటు అరబ్ దేశాల నుంచి భారీ పెట్టుబడులు వస్తాయని భావిస్తోంది.

ఎలక్ట్రిక్ వాహనాల-ఈవీ తయారీలో టెస్లా కార్ల కంపెనీ ఒకటి. ఇండియాలో ఆ కంపెనీ పెట్టేందుకు దృష్టి సారిస్తున్నట్లు సీఈఓ ఎలన్‌మస్క్ వెల్లడించారు. ఈ ఏడాది చివరలో ఇండియా వచ్చి ప్రధాని నరేంద్రమోదీని కలుస్తానని తెలిపారు. ఆ కంపెనీ కోసం చాలా రాష్ట్రాలు పోటీపడుతున్నాయి. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణతోపాటు ఏపీ కూడా రేసులో ఉంది.

ALSO READ: ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ

2017లో దావోస్‌కు వెళ్లినప్పుడు టెస్లా కంపెనీ సీఈఓ ఎలన్ మస్క్‌తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. పాత పరిచయాలతో ఆ కంపెనీని రప్పించేందుకు పావులు కదుపుతున్నారట. ఈ క్రమంలో మంత్రి నారా లోకేష్‌ను రంగంలోకి దించినట్టు తెలుస్తోంది. అంతా అనుకున్నట్లు జరిగితే ఆయన త్వరలో అమెరికా వెళ్లి ఎలన్‌మస్క్‌తో సమావేశమయ్యే అవకాశముందని తెలుస్తోంది. ఈ ఏడాది చివరలో మస్క్ ఇండియాకు  వచ్చేలోపు కంపెనీని ఏపీకి రప్పించేందుకు ఆలోచన చేస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News