Big Stories

Chandrababu: చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి భారీ ఏర్పాట్లు

Chandrababu Swearing In Ceremony: సీఎంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నాల్గవసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకార మహోత్సవానికి కృష్ణా జిల్లాలోని కేసరపల్లి సిద్దమవుతోంది. జూన్ 12న జరిగే ఈ కార్యక్రమానికి దేశ ప్రధానితో పాటు జాతీయ స్థాయి నేతలు  హాజరుకానున్న నేపథ్యంలో అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

- Advertisement -

5 ప్రాంతాల్లో 65 ఎకరాల్లో పార్కింగ్ సైతం ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి వచ్చే అతిథుల కోసం విజయవాడలోని అన్ని హోటళ్లను బుక్ చేశారు. ఏపీలో సీఎంతో పాటు కొత్త ప్రభుత్వ మంత్రి వర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో ఇందుకు సంబంధించిన ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎంతో పాటు మంత్రి వర్గం ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరవుతారని అంచనా వేస్తున్నారు.

- Advertisement -

విజయవాడ నుంచి గన్నవరం మధ్యలోని కేసరపల్లిలో కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వేదికగా నిర్ణయించారు. ప్రక్కనే ఉన్న జాతీయ రహదారికి దగ్గరలోనే గన్నవరం విమానాశ్రయం ఉండటంతో విజయవాడ నుంచి రాకపోకలకు అనువుగా ఉంటుందని కేసరపల్లిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సుమారు 14 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ప్రధాన వేదికనకు ఇరువైపులా భారీ షెడ్లను కూడా నిర్మిస్తున్నారు. ఇందుకోసం వేలాది మంది కార్మికులు రాత్రి పగలు తేడా లేకుండా పనులు చేస్తున్నారు. ఆహ్వానితులకు పాసులు కూడా కేటాయించనున్నారు. ప్రమాణ స్వీకార ఏర్పాట్ల కోసం నలుగురు ఉన్నతాధికారుతో ప్రభుత్వం కమిటీ వేసింది.

ప్రధాని మోదీతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి జాతీయ స్థాయి నేతలు హాజరయ్యే అవకాశం ఉండటంతో వారి కోసం 50 మందికి సరిపోయేలా సభా వేదిక నిర్మిస్తున్నారు. జాతీయ స్థాయి నేతలతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకానున్నారు. సభా ప్రాంగణాన్ని పసుపు, తెలుపు రంగుల మేళవింపుతో తీర్చిదిద్దుతున్నారు.

Also Read:  ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై.. కేశినేని నాని సంచలన నిర్ణయం..

చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి జగన్ ప్రభుత్వ బాధితులను కూడా ఆహ్వానిస్తున్నారు. అయితే వీరి కోసం ప్రత్యేక గాలరీని కూడా ఏర్పాటు చేస్తున్నారు. అబ్దుల్ సలాం, డ్రైవర్ సుబ్రహ్మణ్యం సహా 112 మంది బాధిత కుటుంబాలకు ఆహ్వానం పంపనున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి టీడీపీ, జనసేన బీజేపీ కార్యకర్తల కోసం ప్రత్యేకంగా సెట్టింగ్  ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే క్యూలైన్లు, బారికేడ్లపై ప్రత్యేక దృష్టి సారించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News