Big Stories

AP TET 2024 Results: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. త్వరలోనే మరోసారి టెట్..!

Minister Nara Lokesh Releases AP TET-2024 Results: ఏపీలో ఈ ఏడాది నిర్వహించిన ఉపాధ్యాయ ఉద్యోగాల అర్హత పరీక్ష – టెట్ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేడు టెట్ ఫలితాలను విడుదల చేశారు. వాటిని ఆన్‌లైన్‌లో చూసుకునే అవకాశం కల్పించారు.

- Advertisement -

త్వరలోనే మరో టెట్ పరీక్ష నిర్వహిస్తామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ఈ టెట్ లో క్వాలిఫై కాని అభ్యర్థులకు, అదేవిధంగా కొత్తగా బీఈడీ, డీఈడీ పూర్తి చేసుకున్నవారికి అవకాశం కల్పిస్తూ త్వరలోనే మరో టెట్ నిర్వహించబోతున్నట్లు మంత్రి తెలిపారు. ఆ తరువాతే మెగా డీఎస్సీ ఉంటుందని చెప్పారు.

- Advertisement -

టెట్ లో అర్హత సాధించిన అభ్యర్థులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. నిరుద్యోగ టీచర్లు ఈ ఫలితాల కోసం గత మూడు నెలల నుంచి ఎదురుచూస్తున్నారని అన్నారు. టెట్ లో అర్హత సాధిస్తేనే డీఎస్సీ రాసేందుకు అర్హులు కావడం, డీఎస్సీలో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉండడంతో ఈ ఫలితాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 2.35 లక్షలమంది నిరుద్యోగ టీచర్లు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం ప్రకటించిన మెగా డీఎస్సీకి సన్నద్ధమయ్యే అభ్యర్థులందరికీ మంచి జరగాలని మంత్రి ఆకాంక్షించారు.

Also Read: AP High Court orders status quo: అప్పటి వరకూ ఆపండి.. వైసీపీ కార్యాలయాల కూల్చివేతపై హైకోర్టు స్టేటస్ కో

అయితే, ఈ ఏడాది ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6 వరకు నిర్వహించిన టెట్ కు 2,35,907 మంది (88.90 శాతం) హాజరయ్యారు. రెండు పేపర్లుగా నిర్వహించిన ఈ పరీక్షలో 1,37,904 మంది (58.4 శాతం) మాత్రమే అర్హత సాధించారని అధికారులు వెల్లడించారు. పేపర్ – 1A (ఎస్జీటీ రెగ్యులర్) కు 1,13,296 మంది పరీక్షకు హాజరుకాగా, 78,142 మంది (66.32 శాతం) మంది అర్హత సాధించారు.

అదేవిధంగా పేపర్ – 1B (ఎస్జీటీ స్పెషల్ ఎడ్యుకేషన్) కు 1700 మంది అప్లై చేసుకోగా, 790 మంది అర్హత సాధించారు. పేపర్ 2A (ఎస్ఏ రెగ్యులర్) కు 1,19,500 మంది హాజరు కాగా,.. 60,846 మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు. పేపర్ -2B(ఎస్ఏ స్పెషల్ ఎడ్యుకేషన్)కు 1,411 మంది పరీక్ష రాయగా.. 1,125 మంది అర్హత సాధించినట్లు అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Also Read: నిరుద్యోగులకు అలర్ట్ .. ఎస్ఎస్‌సీలో 17 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్

విడుదల చేసిన టెట్ పరీక్ష ఫలితాలను https://aptet.apsfss.in/ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఫలితాలను చెక్ చేసుకోవాలనుకునే అభ్యర్థులు వెబ్‌సైట్‌లోకి వెళితే అందులో పరీక్షకు హాజరైన అభ్యర్థుల జాబితా కనిపిస్తుంది. దాని కిందనే ‘క్లిక్ హియర్ ఫర్ రిజల్ట్స్’ అనే లింక్‌ను కూడా ఇచ్చారు. దానిపై క్లిక్ చేస్తే మరో పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో అభ్యర్థి ఐడీ, పుట్టిన తేదీ, వెరిఫికేషన్ కోడ్ వివరాలను ఎంటర్ చేసి లాగిన్‌పై క్లిక్ చేస్తే ఫలితాలు కనిపించనున్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News