Big Stories

AP TET Notification Released: ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదల

AP TET notification 2024 update(Latest news in Andhra Pradesh): ఏపీలో 16 వేలకు పైగా టీచర్ ఉద్యోగాల భర్తీకి మెగా డీఎస్సీ నిర్వహించనున్న నేపథ్యంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) కు నోటిఫికేషన్ విడుదలయ్యింది. పాఠశాల విద్యాశాఖ అధికారులు సోమవారం ఈ నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఆన్‌లైన్ విధానంలో జరగనున్న ఈ పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. అదేవిధంగా మెగా డీఎస్సీకి సంబంధించి వచ్చే వారం ప్రత్యేక ప్రకటన విడుదల చేయనున్నారు. అయితే, డీఎస్సీలో టెట్ కు 20 శాతం వెయిటేజీ ఉన్న విషయం తెలిసిందే.

- Advertisement -

టెట్ షెడ్యూల్ వివరాలు..

  • టెట్ నోటిఫికేషన్ – జులై 2
  • ఫీజు చెల్లింపు తేదీ – జులై 3 నుంచి 16 వరకు
  • ఆన్‌లైన్ దరఖాస్తులు – జులై 4 నుంచి 17 వరకు
  • జులై 16 నుంచి ఆన్ లైన్ మాక్ టెస్టు అందుబాటులోకి
  • హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ – జులై 25 నుంచి
  • పరీక్షలు – ఆగస్టు 5 నుంచి 20 వరకు (రెండు సెషన్లలో)
  • ప్రొవిజినల్ కీ – ఆగస్టు 10
  • ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకరణ – ఆగస్టు 11 నుంచి 21 వరకు
  • తుది కీ విడుదల – ఆగస్టు 25
  • ఫలితాలు విడుదల – ఆగస్టు 30
- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News