Big Stories

AP DSC Notification Cancelled: ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు

AP Govt Cancelled old DSC Notification(AP latest news): మెగా డీఎస్సీతోపాటు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించేందుకు కొత్త ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జులై 1న మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానున్నది. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల డీఎస్సీ ప్రకటనను రద్దు చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులను జారీ చేసింది. అయితే, వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ లో 6100 టీచర్ పోస్టులు మాత్రమే ఉన్నాయి. తాజాగా కూటమి ప్రభుత్వం 16,347 పోస్టులతో మెగా డీఎస్సీని ప్రకటించింది.

- Advertisement -

ఫిబ్రవరి, మార్చి నెలల్లో నిర్వహించిన టెట్ లో అర్హత సాధించనివారు, ఈ టెట్ ప్రకటన తరువాత బీఈడీ, డీఈడీ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు ఉన్నందున మెగా డీఎస్సీతోపాటు టెట్ కూడా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టెట్, మెగా డీఎస్సీకి సంబంధించి ఒకేసారి కొంచెం తేదీల మార్పుతో దరఖాస్తులను స్వీకరించనున్నారు. మొదట టెట్ నిర్వహించనున్నారు. ఆ తరువాత డీఎస్సీకి సన్నద్ధమయ్యేందుకు 30 రోజుల సమయం ఇవ్వాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. అనంతరం డీఎస్సీ పరీక్ష ఉంటుంది.

- Advertisement -

జులై 1న మెగా డీఎస్సీ, టెట్ కు ప్రకటనలు ఇచ్చేందుకు అధికారులు కసరత్తు పూర్తి చేశారు. కాగా, గత డీఎస్సీకి అప్లై చేసుకున్నవాళ్లు దరఖాస్తు రుసుములు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ, కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఇదిలా ఉంటే.. మెగా డీఎస్సీ కోసం మరోసారి టెట్ నిర్వహిస్తామని ప్రభుత్వం గతంలో పేర్కొన్న విషయం తెలిసిందే. డీఎస్సీతోపాటు టెట్ పరీక్షను నిర్వహించనున్నారు. ఏపీ టెట్(జులై)-2024 ఆన్లైన్ పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారం అధికారిక వెబ్ సైట్ లో ఉంచామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్ తాజాగా వెల్లడించారు. షెడ్యూల్, నోటిఫికేషన్స్, ఇన్ఫర్మేషన్ బులెటిన్, సిలబస్ వివరాలన్నిటినీ అందులో పొందుపరిచినట్లు తెలిపారు. పరీక్షలను ఆన్లైన్ విధానంలో(సీబీటీ) జరుగుతాయని పేర్కొన్న విషయం తెలిసిందే.

Also Read: ఏపీ వాలంటీర్లకు త్వరలోనే గుడ్ న్యూస్: మంత్రి కందుల దుర్గేష్

ఈ డీఎస్సీలో సెకండరీ గ్రేట్ టీచర్లు(ఎస్జీటీ) – 6,371, స్కూల్ అసిస్టెంట్లు(ఎస్ఏ)-7,725, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (టీజీటీలు)- 1,781, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్స్(పీజీటీలు)-286, ప్రిన్సిపాల్స్ 52, వ్యాయామ ఉపాధ్యాయులు(పీఈటీలు)-132 ఉద్యోగాలు ఉన్నాయి. అయితే, టెట్ పరీక్షలో అర్హత సాధిస్తేనే డీఎస్సీ రాసేందుకు అర్హులు కావడం, డీఎస్సీలో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉండడంతో అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News