Big Stories

AP Minsters Portfolios : ఏపీ మంత్రులకు కేటాయించిన శాఖలివే.. పవన్ చేతికి కీలక శాఖలు

AP Cabinet Minsters Portfolios : ఏపీ ఉప ముఖ్యమంత్రిగా పవన్‌కు అవకాశం కల్పించారు సీఎం చంద్రబాబు నాయుడు. మంత్రులకు శాఖలు కేటాయించారాయన. ముఖ్యమంత్రి తర్వాత సింహభాగం పోర్ట్‌ఫోలియోలు పవన్ చేతికి అప్పగించారు. కీలకమైన పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధితోపాటు.. గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను పవన్‌కు కేటాయించారు చంద్రబాబు.

  • నారా లోకేష్‌కు.. గతంలో చేపట్టిన ఐటీ మంత్రిత్వశాఖతో పాటు రియల్‌టైం గవర్నెన్స్, మానవ వనరుల అభివృద్ధి పోర్ట్‌ఫోలియోలు అప్పగించారు.
  • హోంశాఖ విషయంలో ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్టే వంగలపూడి అనిత చేతికి వెళ్లింది. అయితే.. శాంతి భద్రతలు మాత్రం సీఎం చంద్రబాబు దగ్గరే ఉంచుకున్నారు. హోం శాఖతో పాటు డిజాస్టర్ మేనేజ్‌మెంట్ శాఖలు అనితకు ఇచ్చారు.
  • ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఎన్నికల్లో పార్టీని నడిపించిన సీనియర్ పొలిటీషియన్ అచ్చెన్నాయుడికీ కీలకమైన శాఖలు దక్కాయి. వ్యవసాయంతో పాటు సహకారం, మార్కెటింగ్, పశుసంవర్దకం, డెయిరీ డెవలప్‌మెంట్, ఫిషరీస్ పోర్టు ఫోలియోలు ఇచ్చారు.
  • తొలిసారి మంత్రి అయిన పయ్యావుల కేశవ్‌కు ఆర్థిక శాఖ అప్పగించారు. అసెంబ్లీ వ్యవహారాలు కూడా ఈయన చేతికే వచ్చాయి. వీటితో పాటు ప్లానింగ్, కమర్షియల్ ట్యాక్సెస్ పోర్ట్‌ఫోలియోలను కేశవ్‌కు ఇచ్చారు.
  • ఇక కొల్లు రవీంద్రకు ఎక్సైజ్ శాఖ, గనుల పోర్ట్‌ఫోలియో దక్కింది. మరో కీలకమైన ఇంధన వనరుల శాఖను గొట్టిపాటి రవికి ఇచ్చారు.
  • పొంగూరు నారాయణకు పట్టణ పరిపాలన, అర్బన్ డెవలప్‌మెంట్‌ను అప్పగించారు చంద్రబాబు నాయుడు.
  • నిమ్మల రామానాయుడుకు జలవనరుల అభివృద్ధి శాఖను కేటాయించారు. పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తామని చెప్తున్న నేపథ్యంలో ఆ బాధ్యతలు నిమ్మలకు అప్పగించినట్టయింది.
  • బీజేపీ నుంచి పోటీ చేసి గెలిచిన సత్యకుమార్ కు ఆరోగ్యం, కుటుంబ సక్షేమం, వైద్య విద్య శాఖలను అప్పగించారు.
  • నాదెండ్ల మనోహర్ కు ఆహార, పౌరసరఫరాల శాఖతోపాటు వినియోగదారుల వ్యవహారాలు శాఖల్ని కేటాయించారు.
  • ఎన్ఎండీ ఫరూక్ కు లా అండ్ జస్టిస్, మైనారిటీ సంక్షేమ శాఖల్ని అప్పగించారు. ఎ. రామనారాయణరెడ్డికి దేవాదాయ శాఖ ఇచ్చారు.
  • కొలుసు పార్థసారథికి గృహ, సమాచార- పౌరసంబంధాల శాఖల్ని అప్పగించారు. అనగాని సత్యప్రసాద్ కు రెవెన్యూ, స్టాంపులు అండ్ రిజిస్ట్రేషన్ పోర్ట్‌ఫోలియోలను ఇచ్చారు.
  • బాలవీరాంజనేయస్వామికి సాంఘిక సంక్షేమం, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమం, సంక్షేమం, సచివాలయం అండ్ విలేజ్ వాలంటీర్ శాఖలు ఇచ్చారు. గొట్టిపాటి రవికి విద్యుత్ శాఖను అప్పగించారు.
  • కందుల దుర్గేష్ కు పర్యాటక, సాంస్కృతిక అండ్ సినిమాటోగ్రఫీ శాఖలు, జి. సంధ్యారాణికి మహిళా అండ్ శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖలు కేటాయించారు.
  • బీసీ జనార్థన్ రెడ్డికి రోడ్లు అండ్ భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖలను, టీజీ భరత్ కు పరిశ్రమలు అండ్ వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖలను కేటాయించారు.
  • ఎస్. సవితకు బీసీ సంక్షేమం, వెనుకబడిన ఆర్థిక వర్గాల సంక్షేమం, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్ టైల్స్, వాసంశెట్టి సుభాష్ కు కార్మిక, కర్మాగాల బాయిలర్స్ అండ్ వైద్య బీమా సేవలు శాఖల్ని ఇచ్చారు.
  • కొండపల్లి శ్రీనివాస్ కు ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ సాధికారత అండ్ సంబంధాలు, ఎం రాం ప్రసాద్ రెడ్డికి రవాణా, యువజన అండ్ స్ప్రోర్ట్స్ శాఖల్ని అప్పగించారు.
- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News