Big Stories

Minister Parthasarathi: గత ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసింది: మంత్రి పార్థసారథి

AP Minister Parthasarathy comments(Andhra news today): గత ప్రభుత్వం ఐదేళ్లలో ఒక్కటంటే ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదని మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం మెగా డీఎస్సీ పేరిట అన్ని స్కూళ్లలో 16,347 టీచర్ పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదించిందని ఆయన వెల్లడించారు. కేబినెట్ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను ఆయన వివరించారు.

- Advertisement -

‘టీచర్ పోస్టులు భర్తీ చేయకుండా గత ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసింది. ఎన్నికల ముందు మాత్రమే డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. టెట్ పరీక్షను ప్రతి ఆర్నెళ్లకోసారి నిర్వహించాల్సి ఉంది.. కానీ, అలా చేయకపోవడం వల్ల వేలాది మంది నిరుద్యోగులు నష్టపోయారు. టెట్ లో తమ మార్కులు ఇంప్రూవ్ చేసుకునే అవకాశం కోల్పోయారు. పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు’ అని ఆయన తెలిపారు.

- Advertisement -

‘ల్యాంట్ టైటిలింగ్ యాక్ట్ చూస్తే చాలు.. గత ప్రభుత్వ పాలన ఏంటో తెలుస్తుంది. కేంద్రం చెప్పిన దానికి రాష్ట్రం అమలు చేసినదానికీ అసలు పొంతనే లేదు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ చట్టాన్ని అమలు చేయలేదు. ఈ చట్టం వల్ల సన్న, చిన్నకారు రైతులు సమస్యలు ఎదుర్కొన్నారు. వివాదాలు వస్తే అప్పిలేట్ అథారిటీ ఎవరో చెప్పలేదు. ఈ చట్టంలో నేరుగా హైకోర్టుకే జ్యురిస్ డిక్షన్ ఇచ్చారు. పేద రైతు ఎవరైనా ఖర్చులు భరించి హైకోర్టుకు వెళ్లగలరా..? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రైతులకు ఒరిజినల్ డాక్యుమెంట్లు అందజేస్తాం’ అంటూ మంత్రి పార్థసారథి తెలిపారు.

‘పెన్షన్ పెంచిన మొత్తాన్ని రూ. 4 వేలు వచ్చే నెల నుంచే ఇస్తాం. పెన్షన్ పెంపు వల్ల 65 లక్షల మందికి లబ్ధి జరుగుతోంది. సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికీ వెళ్లి పెన్షన్ పంపిణీ చేస్తాం. కొన్ని రకాల వ్యాధి బాధితులకు రూ. 10 వేల పెన్షన్ ఇస్తాం. స్కిల్ డెవలప్ మెంట్ కు మా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తుంది. వ్యవసాయ రంగంలోనూ స్కిల్ డెవలప్ మెంట్ అమలు చేస్తాం. గంజాయి నియంత్రణకు మంత్రులతో కమిటీని ఏర్పాటు చేయగా.. ఈ కమిటీలో సభ్యులుగా హోం, విద్య, గిరిజన, ఎక్సైజ్ శాఖ మంత్రులు ఉంటారు. రాష్ట్రంలో గంజాయి సమస్యను అరికట్టేందుకు కట్టుబడి ఉన్నాం. గంజాయిని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకున్నాం. కమిటీ ఇచ్చిన సూచనల మేరకు చర్యలు తీసుకుంటాం’ అని మంతి అన్నారు.

Also Read: ఎవరూ అధైర్యపడొద్దు.. రాబోయే కాలం మనదే: జగన్

‘అన్న క్యాంటీన్లను మళ్లీ ప్రారంభిస్తున్నాం. తొలుత 183 అన్న క్యాంటీన్లను ఒకేసారి ప్రారంభిస్తాం.. త్వరలో మరో 20 అన్న క్యాంటీన్లను తెరుస్తాం. వైఎస్సార్ ఆరోగ్య వర్సిటీ పేరును ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీగా మార్చాం. వైద్యులు, ప్రజాప్రతినిధుల విజ్ఞప్తుల మేరకే పేరును మార్పు చేశాం. రాష్ట్రంలో నైపుణ్య గణన కార్యక్రమానికి, రాష్ట్ర ఏజీగా దమ్మాలపాటి శ్రీనివాస్ ను నియమిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది’ అంటూ మంత్రి పార్థసారథి వివరాలు వెల్లడించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News