Big Stories

AP: శాఖల కేటాయింపు తర్వాత తొలిసారిగా మీడియాతో మాట్లాడిన లోకేశ్.. ఏం చెప్పారంటే..?

Minister Nara Lokesh: వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల హామీ నెరవేర్చేందుకు తీవ్రంగా కృషి చేస్తామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. మంత్రులకు శాఖల కేటాయింపు అనంతరం ఆయన తొలిసారిగా మీడియాతో మాట్లాడారు. ఉద్యోగాల కల్పన విషయంలో ఇతర రాష్ట్రాలతో పోటీ పడుతామంటూ ఆయన పేర్కొన్నారు. రాష్ట్రానికి మరిన్ని ఐటీ, ఎలక్ట్రానిక్ కంపెనీలను తీసుకొస్తామన్నారు. వలస వెళ్లిన యువతకు స్థానికంగానే ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తామంటూ లోకేశ్ హామీ ఇచ్చారు. పరిశ్రమల్లో ఉద్యోగాలు సాధించేందుకు యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తామని ఆయన తెలిపారు.

- Advertisement -

ఇటు టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి కూడా మీడియాతో మాట్లాడారు. తప్పు చేసిన అధికారులను విడిచిపెట్టే ప్రసక్తే లేదని, చట్టం ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. రాజమహేంద్ర వరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో గంజాయి నిర్మూలనకు పటిష్ఠ చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో అధికారులు కనీసం ప్రొటోకాల్ పాటించలేదని, ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన కనీస మర్యాద కూడా ఇవ్వలేదంటూ వైసీపీపై తీవ్ర స్థాయిలో పైరయ్యారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో జరిగినటువంటి భూ అక్రమాలపై విచారణ చేయిస్తామంటూ ఆయన హామీ ఇచ్చారు.

- Advertisement -

Also Read: టీడీపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు ఇతనేనంటా..!

ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ సాయాన్ని రూ. 3 వేల నుంచి రూ. 4 వేలకు చంద్రబాబు పెంచారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. సంక్షేమమేకాదు ఇటు అభివృద్ధిపై కూడా తమ ప్రభుత్వం దృష్టి సారిస్తదని ఆయన పేర్కొన్నారు. అన్న క్యాంటీన్లను కూడా తెరిపిస్తామంటూ ఆయన తెలిపారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News