Big Stories

AP Lawcet Results out: ఏపీ లా సెట్, పీజీసెట్ 2024 ఫలితాలు విడుదల

AP Lawcet Results 2024 update(Latest news in Andhra Pradesh): ఏపీ లా సెట్, పీజీ ఎల్ సెట్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అధికారులు గురువారం లా సెట్ ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్రంలో ఉన్న న్యాయ కళాశాలల్లో మూడేళ్లు, ఐదేళ్ల ఎల్ఎల్‌బీ, రెండేళ్ల ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం జూన్ 9న ఈ పరీక్షను నిర్వహించారు.

- Advertisement -

ఈ పరీక్షకు 19,224 మంది అభ్యర్థులు హాజరుకాగా, 17,117 మంది (89.04 శాతం) ఉత్తీర్ణత సాధించారంటూ లాసెట్ కన్వీనర్ ఆచార్య సత్యనారాయణ తెలిపారు. రెండేళ్ల పీజీ కోర్సులో 99.51 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, మూడేళ్ల ఎల్ఎల్‌బీ కోర్సులో 89.74 శాతం, ఎల్ఎల్‌బీ కోర్సులో 80.06 శాతం చొప్పున అర్హత సాధించినట్లు ఆయన వెల్లడించారు.

- Advertisement -

అయితే, రెండేళ్ల ఎల్ఎల్ఎమ్ కోర్సులో కృష్ణా జిల్లాకు చెందిన పొట్లూరి అభినేత్ జాసన్ మొదటి ర్యాంక్ సాధించగా, గుంటూరు జిల్లాకు చెందిన దీప్తి – రెండో ర్యాంక్, ఎన్టీఆర్ జిల్లాకు చెందిన నువ్వుల జాహ్నవి – మూడో ర్యాంక్ సాధించారు. అదేవిధంగా ఐదేళ్ల ఎల్ఎల్‌బీ కోర్సులో విజయనగరం జిల్లాకు చెందిన కుసుం అగర్వాల్ మొదటి ర్యాంక్ సాధించగా, మల్కాజిగిరికి చెందిన నందినికి రెండో ర్యాంక్ వచ్చింది. గోపిశెట్టి విజయ్ ఆదిత్య శ్రీవాత్సవ్  మూడో ర్యాంక్ సాధించారు. మూడేళ్ల ఎల్ఎల్‌బీ కోర్సులో తిరుపతికి చెందిన కృష్ణ చైతన్య యామల తొలి ర్యాంక్ సాధించగా, కోనసీమకు చెందిన హర్ష వర్దన్ రాజుకు రెండో ర్యాంక్, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన చెల్లుబోయిన రేవంత్ మూడో ర్యాంక్ సాధించారు.

Also Read: ‘రెడ్ బుక్’ అసలు విషయం చెప్పిన హోంమంత్రి అనిత

ఇదిలా ఉంటే.. రాష్ట్రంలోని పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పీజీసెట్ 2024 ఫలితాలను విడుదల చేశారు. జూన్ 10 నుంచి 13 వరకు ఆంధ్రా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ పరీక్షలను నిర్వహించారు. గురువారం సాయంత్రం సంబంధిత అధికారులు ఈ ఫలితాలను విడుదల చేశారు. పీజీ సెట్ లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు 17 యూనివర్సీటీలు, వాటి అనుబంధ పీజీ కాలేజీల్లో 145కి పైగా పీజీ కోర్సులలో ప్రవేశాలు కల్పిస్తారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News