Big Stories

Jagan’s Strategic Mistake: జగన్ వ్యూహాత్మక తప్పిదం.. వైసీపీ నుంచి బీసీలు అవుట్!

AP Jaganmohan Reddy Strategical Mistake Regarding BCs: అధికారంలో ఉన్నపుడు వ్యవస్థల అండ ఉండొచ్చు కానీ.. సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. ప్రశ్నించే హక్కు చాలా తక్కువగా ఉంటుంది. కానీ, ప్రతిపక్షంలో ఉన్నపుడు ప్రశ్నించే అవకాశం, పోరాటం చేసే హక్కు.. రెండు ఉంటాయి. అధికార పార్టీ నేతలు తప్పు చేస్తే.. ప్రశ్నించే అవకాశాలు ప్రతిపక్ష నేతలకు తరచూ వస్తూ ఉంటుంది. ఆ ప్రశ్నలకు అధికార పార్టీ నుంచి సమాధానం రాకపోతే.. పోరాటాలు చేసే అవకాశాన్ని కూడా తీసుకోవచ్చు. ఆ పోరాటాలే రేపటి గెలుపునకు బాటలు అవుతాయి.

- Advertisement -

కానీ.. ఏపీలో ప్రతిపక్ష వైసీపీ మొదటిలోనే ప్రశ్నించే గొప్ప అవకాశాన్ని వదులుకుంది. 2019 ఎన్నికల్లో బీసీలు వైసీపీకి సపోర్టు చేశారు. దీంతో.. వైసీపీ అధికారంలోకి వచ్చింది. కానీ, మొన్నటి ఎన్నికల్లో మాత్రం అదే బీసీలు కూటమికే జై కొట్టారు. దాని ఫలితమే.. వైసీపీ ఘోర ఓటమి. ఏపీలోనే బీసీ జనాభా ఎక్కువగా ఉండటంతో దేశవ్యాప్తంగా ఇప్పుడు బీసీ స్లోగన్స్ బలంగా వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే కులగణన చేయాలనే డిమాండ్స్ వస్తున్నాయి. కాంగ్రెస్ గట్టిగా ఈ డిమాండ్ చేసింది కాబట్టే.. దేశవ్యాప్తంగా బలపడింది. కాంగ్రెస్ డిమాండ్‌ను బీజేపీ లైట్ తీసుకుంది కాబట్టే.. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది.

- Advertisement -

బీసీ నినాదాలు బలంగా వినిపిస్తున్న సమయంలో జగన్ వ్యూహాత్మక తప్పిదం చేశారు. పార్లమెంట్‌లో జగన్ పదవులను ప్రకటించారు. అయితే.. అన్ని పదవులూ తన సామాజిక వర్గానికే కేటాయించుకున్నారు. వైసీపీ లోక్‌సభా పక్షనేతగా మిథున్ రెడ్డి, రాజ్యసభా పక్షనేతగా విజయసాయిరెడ్డిని, పార్లమెంటరీ పార్టీనేతగా సుబ్బారెడ్డిని నియమించారు. మొత్తం మూడు పదవులు కూడా తన సామాజిక వర్గానికి చెందినవారికే కట్టబెట్టారు. మాట్లాడితే నా బీసీ, నా ఎస్సీ అనే జగన్ .. ఇప్పుడు మాత్రం బీసీలకు అవకాశం కల్పించలేదు. మూడింటిలో ఒకటి అయినా బీసీలకు ఇచ్చి ఉండాల్సిందనే అభిప్రాయం వైసీపీ వర్గాల్లోనే బలంగా వినిపిస్తోంది.

Also Read: శాఖల కేటాయింపు తర్వాత తొలిసారిగా మీడియాతో మాట్లాడిన లోకేశ్.. ఏం చెప్పారంటే..?

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. మూడు పార్టీలు కలిపి ఇప్పుడు పదవులు, నామినేటెట్ పోస్టులు పంచుకోవాల్సి ఉంటుంది. ఇలా మూడు పార్టీలు పంచుకున్నప్పుడు ఏదో ఒక సామాజిక వర్గానికి న్యాయం జరగకపోవచ్చు. అలాంటి టైంలో జగన్ ఆ సామాజిక వర్గం తరుఫున ప్రశ్నించే అవకాశాన్ని కోల్పోయారు. తన పార్టీలో మొత్తం మూడు పదవులు కూడా తన సొంత సామాజికవర్గం, తనకు కావాల్సిన వారికి ఇచ్చుకున్నారు. బీదా మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ లాంటి వారు చాలా మంది బీసీలు ఉన్నారు. కానీ.. వాళ్లకు ఇవ్వలేదు. అయితే.. జగన్ బీసీలకు పదవి ఇవ్వలేదు.. అనేది అక్కడితో ఆగదు.. బీసీల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కును కూడా కోల్పోయారు. ఒకవేళ ప్రశ్నించినా.. ముందు ఆయన సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితిని తెచ్చుకున్నారు.

అయితే.. దీనిపై మరో అంశం కూడా తెరపైకి వస్తుంది. జగన్ ఇప్పుడే కాదు.. అధికారంలో ఉన్నపుడు కూడా బీసీలకు, వెనబడిన వర్గాలకు న్యాయం చేయలేదనే వాళ్లు కూడా ఉన్నారు. పేరుకే అన్ని వర్గాలకు పదవులు ఇచ్చినా.. పవర్స్ మాత్రం తన దగ్గరే పెట్టుకున్నాడనే విమర్శలు తొలి నుంచి ఆయన ఎదుర్కొంటున్నారు. జగన్ హయాంలో ఐదు ఉప ముఖ్యమంత్రులు ఉన్నా.. వాళ్లు పేర్లు కూడా ఎవరికీ తెలియదు. ఇక మంత్రుల విషయానికి వస్తే ఓ నలుగురు టీడీపీ, జనసేనను తిట్టిన వాళ్లు తప్పా.. వాళ్లు ఏ శాఖ నిర్వహిస్తున్నారో కూడా ఎవరికీ తెలియదు. ప్రపంచాన్నే వణికించిన కరోనా టైంలో కూడా ఏపీలో హెల్త్ మినిస్టర్ ఎవరో తెలియదు. అలా పేరుకు మాత్రమే పదవులు కానీ.. వారికి ఉన్న పవర్స్ మాత్రం సజ్జల రామకృష్ణ దగ్గర ఉండేవనే విమర్శలు వైసీపీ ప్రభుత్వంపై ఉండేవి. కాబట్టి.. ఇప్పుడు కొత్తగా బీసీలకు జగన్ న్యాయం చేస్తారు అనుకోవడం పొరపాటేనని అనేవాళ్లు కూడా ఉన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News