Big Stories

Home Minister Anitha Explained about Red Book: ‘రెడ్ బుక్’ అసలు విషయం చెప్పిన హోంమంత్రి అనిత

AP Home Minister Anitha Explained about Red Book: ‘రెడ్ బుక్’ అంశానికి సంబంధించి ఏపీ హోంమంత్రి అనిత క్లారిటీ ఇచ్చారు. రాష్ట్ర డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో గురువారం సమావేశమైన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుతం నాలుగు అంశాలను అజెండాగా పెట్టుకుని ముందుకు వెళ్తున్నామన్నారు. గంజాయి నిర్మూలన, పోలీస్ సంక్షేమం, మహిళలకు రక్షణ, పోలీస్ శాఖలో నియామకాల భర్తీకి సంబంధించి చర్యలు తీసుకుంటామన్నారు. ”రెడ్ బుక్’ కక్షసాధింపు చర్యల కోసం కాదు.. గత ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా పనిచేసిన అధికారులపై చర్యలుంటాయి. మాకు నిజంగా కక్ష సాధింపే ఉంటే ఇంతకాలం ఆగుతామా.?. పగ, ప్రతీకారాల ఆలోచన చేయడం లేదు. మా నాయకుడు చంద్రబాబు చెప్పిన ప్రకారం రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తాం’ అని ఆమె చెప్పారు.

- Advertisement -

‘ఈ 12 రోజుల్లో చాలా అంశాలను పరిశీలించాను. వైసీపీ హయాంలో పోలీస్ వ్యవస్థను నాశనం చేశారు. పోలీసులను కేవలం బందోబస్తుకే వాడుకున్నారు. ఒక్క కానిస్టేబుల్ ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు. ఏపీలో ఇంతవరకు పోలీస్ అకాడమీ, గ్రేహౌండ్ అకాడమీ లేదు. కేంద్రం నుంచి నిధులొచ్చినా పోలీస్ అకాడమీ నిర్మాణాన్ని పూర్తిచేయలేదు. విశాఖపట్నం జిల్లాలో ఓ పోలీస్ స్టేషన్ ఇంకా రేకుల షెడ్డూలోనే కొనసాగుతుంది. ఎస్కార్ట్ వాహనాలు కూడా పనిచేయడం లేదని చెబుతున్నారు. 2014లో ఇచ్చిన వాహనాలనే ఇప్పటికీ వాడుతున్నారు. పోలీస్ స్టేషన్లలో స్టేషనరీ ఖర్చులకు కూడా గత ప్రభుత్వం నిధులు ఇవ్వలేదు’ అంటూ ఆమె పేర్కొన్నారు.

- Advertisement -

‘రాష్ట్రంలో గంజాయి రవాణా బాగా పెరిగింది. నేషనల్ క్రైం రికార్డులో ఏపీని మూడో స్థానంలోకి తెచ్చారు. గంజాయి నిర్మూలనకు సంబంధించి అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తాం. ఇప్పటికే ఉపసంఘాన్ని ఏర్పాటు చేశాం. 100 రోజుల ప్రణాళిక ఏ విధంగా అమలు చేయాలనే అంశంపై చర్చిస్తాం. ప్రజల భాగస్వామ్యంతోనే గంజాయిని అరికట్టవచ్చు. మంచి ఆలోచనతో పనిచేస్తే రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావొచ్చు. ఎలాంటి శిక్షణ లేకుండా సచివాలయాల్లో మహిళా పోలీసులను నియమించారు. శిక్షణ లేకుండా వారు ఏ విధంగా పోలీస్ విధులు నిర్వర్తిస్తారు..? వారిని ఏ విధంగా వినియోగించుకోవాలనేదానిపై చర్చిస్తున్నాం’ అని హోంమంత్రి అన్నారు.

Also Read: వైసీపీ ఆఫీసుల కూల్చివేతపై ముగిసిన విచారణ.. తీర్పు రిజర్వు

‘కలిసి కట్టుగా పనిచేసి పోలీసుల పనితీరులో మార్పులు తెస్తాం. ప్రజలు ధైర్యంగా స్టేషన్ కు వెళ్లి బాధలు చెప్పుకునేలా భరోసా ఇవ్వాలి. పోలీస్ సిబ్బంది ప్రజలతో మర్యాదగా మెలగాలి. ఏపీలో ఆడపిల్లల అదృశ్యం ఘటనలు చాలా ఉన్నాయి. ఫిర్యాదు చేసేందుకు ఎవరైనా వస్తే వారిని కించపరిచేలా మాట్లాడొద్దు. పోలీసులు అంటే ప్రతిపక్ష పార్టీ నేతల అరెస్టుల కోసం మాత్రమే గత ప్రభుత్వం వినియోగించింది. ఇకపై ఏపీలో ఫ్రెండ్లీ పోలీసింగ్ రావాలి. సోషల్ మీడియాలో ఇప్పటికీ నేను బాధితురాలినే. కొంతమంది ఉన్నతాధికారుల తీరుతో వ్యవస్థకు చెడ్డపేరు వస్తుంది. వారు గత ప్రభుత్వంలో అక్రమ కేసులు పెట్టారు. నాపై కూడా 23 కేసులు నమోదు చేశారు. అసభ్య పోస్ట్ లపై విచారణ చేసి చర్యలు తీసుకుంటాం. అక్రమ కేసులకు సంబంధించి సీఎం చంద్రబాబుతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. పోలీసులంటే ప్రజల్లో ఒక నమ్మకం, గౌరవాన్ని తీసుకొస్తాం. ఏపీలో దిశ చట్టమే లేదు. ఇక ఆ స్టేషన్ల పేరును కూడా మార్చే ఆలోచన చేస్తున్నాం’ అంటూ హోంమంత్రి అనిత తెలిపారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News