Big Stories

AP High Court Reserves Judgment: వైసీపీ ఆఫీసుల కూల్చివేతపై ముగిసిన విచారణ.. తీర్పు రిజర్వ్!

AP High Court Reserves Judgment: ఏపీలో వైసీపీ ఆఫీసుల కూల్చివేతపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ ముగిసింది. విచారణ అనంతరం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు న్యాయస్థానం ప్రకటించింది. తీర్పు వెలువరించేంతవరకు స్టేటస్ కో కొనసాగుతుందని పేర్కొన్నది. మొత్తం 16 వైసీపీ కార్యాలయాలపై స్టేట్ కో కొనసాగుతుందంటూ హైకోర్టు స్పష్టం చేసింది.

- Advertisement -

కాగా, ఏపీలో వైసీపీ కార్యాలయాలకు నోటీసులు ఇవ్వడం, వాటిని కూల్చివేయడంతో ప్రస్తుతం రాజకీయాల్లో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. గతంలో అధికారంలో ఉన్నటువంటి వైసీపీ సర్కారు.. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పార్టీ ఆఫీసులు నిర్మించిన, నిర్మిస్తున్న కట్టడాలు అక్రమమంటూ ప్రస్తుతమున్న ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఈ క్రమంలో గుంటూరు తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయం సహా పలు జిల్లాల్లో ఉన్న పార్టీ ఆఫీసులను కూల్చివేయడంతో తీవ్ర రాజకీయ దుమారం రేగింది. మీడియాలో, సోషల్ మీడియాలో ఈ అంశంపై అధికార, ప్రతిపక్ష నేతల మధ్య తీవ్ర మాటల యుద్ధం కొనసాగింది. ఈ క్రమంలోనే ఈ వ్యవహారం ఏపీ హైకోర్టు వరకు చేరడంతో.. పరిశీలించిన న్యాయస్థానం విచారణ జరిపింది. విచారణ పూర్తి కావడంతో తీర్పును రిజర్వ్ చేసింది. అప్పటివరకు యథాతథా స్థితిని కొనసాగించాలని పేర్కొన్నది.

- Advertisement -

Also Read: ‘రెడ్ బుక్’ అసలు విషయం చెప్పిన హోంమంత్రి అనిత

అయితే, ఇప్పటికే వైసీపీ కార్యాలయాల కూల్చివేతపై ఆ పార్టీ నేత అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్రంలోని నిర్మించిన తమ పార్టీ ఆఫీసులను అక్రమంగా కూల్చివేస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. మరికొన్ని చోట్ల కూడా నోటీసులు జారీ చేశారంటూ ఆయన కోర్టుకు తెలిపారు. రాష్ట్రంలోని మొత్తం 11 వైసీపీ కార్యాలయాలకు సంబంధించిన కూల్చివేతలు, నోటీసుల గురించి న్యాయస్థానానికి వివరించారు. కాగా, మరికొన్ని కార్యాలయాలకు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో నేడు కూడా మరో లంచ్ మోషన్ పిటిషన్ ను వైసీపీ దాఖలు చేసింది. ప్రతిపక్ష పార్టీ కార్యాలయాలను రాజకీయ కక్ష్యతో కూల్చివేస్తున్నారంటూ వైసీపీ తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలోనే వైసీపీ ఆఫీసుల కూల్చివేతపై విచారణను ముగించిన హైకోర్టు.. తీర్పును రిజర్వ్ చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు స్టేటస్ కోను కొనసాగించాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

ఇదిలా ఉంటే.. కార్యాలయాల కూల్చివేతలు, నోటీసులపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం జూన్ 27 వరకు స్టేటస్ కో విధించిన విషయం తెలిసిందే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News