Big Stories

EVM Damage Case : కౌంటింగ్ రోజున అక్కడికి వెళ్లొద్దు.. మీడియాతో మాట్లాడొద్దు : పిన్నెల్లికి హైకోర్టు ఆంక్షలు

AP high court on Pinnelli Bail petition(AP updates):

వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గురువారం కొంత ఊరట లభించినా శుక్రవారం భారీ షాక్ ఎదురైంది. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేస్తూ ఆంక్షలు విధించింది. ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు అయినా కూడా ఆయన కదలికలపై హైకోర్టు పలు ఆంక్షలు విధించింది. ఇందుకు సంబంధించి ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఓట్ల లెక్కింపు రోజున మాచర్ల వెళ్లొద్దని ఆదేశించింది.

- Advertisement -

నరసరావుపేట కౌంటింగ్ కేంద్రానికి వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. అయితే, వచ్చే 6 నెలల పాటు నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గం పరిధి దాటి ఎక్కడా వెళ్లొద్దని ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి మీడియాతో కూడా మాట్లాడొద్దని పేర్కొంటూ ఆంక్షలు విధించింది. అదేవిధంగా కేసుపై సాక్షులతో మాట్లాడటానికి వీల్లేదంటూ హైకోర్టు ఆదేశించింది. పిన్నెల్లి కదలికలపై పూర్తిస్థాయిలో నిఘా పెట్టాలని పేర్కొన్న ఉన్నత న్యాయస్థానం ఈ మేరకు సీఈఓ.. పోలీస్ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేయాలని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో ఏ-1 నిందితుడిగా ఉన్నటువంటి పిన్నెల్లిపై జూన్ 6 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవొద్దంటూ రాష్టర్ హైకోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసిన విషయం విధితమే.

- Advertisement -

అయితే, ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజు మాచర్ల నియోజకవర్గంలోని పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలోకి వెళ్లిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బీభత్సం సృష్టించారు. పోలింగ్ సిబ్బందిపై దుర్భాషలాడుతూ ఈవీఎం మెషిన్ ను ధ్వంసం చేశారు. దీంతో ఈసీకి పోలింగ్ సిబ్బంది ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కేసులు నమోదు చేసి, వెంటనే అరెస్ట్ చేయాలంటూ పోలీసులను ఎన్నికల సంఘం ఆదేశించింది.

Also Read: విశాఖకు చేరుకున్న కంబోడియా బాధితులు.. అసలు ఏం జరిగిందంటే.?

ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలీసులు.. పిన్నెల్లిపై 10 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అనంతరం అతడిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించారు. తనకు ముందస్తు బెయిల్ ను మంజూరు చేయాలని కోరారు. ఆ బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. పిన్నెల్లిపై జూన్ 5 వరకు చర్యలు తీసుకోవొద్దని ఆదేశించింది. అదేవిధంగా తాజాగా పలు ఆంక్షలు విధిస్తూ ఊత్తర్వులను జారీ చేసింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News