Big Stories

AP High Court: ఎలిమెంటరీ తరగతుల ఉమ్మడి పరీక్ష రద్దు.. చట్ట విరుద్ధమంటూ హైకోర్టు తీర్పు

AP High Court: ఏపీలో 1 నుంచి 8వ తరగతి వరకు విద్యను అభ్యసిస్తున్న ఎలిమెంటరీ విద్యార్థులకు ఉమ్మడి పరీక్షల నిర్వహణ విధానాన్ని హైకోర్టు రద్దు చేసింది. విద్యాహక్కు చట్టంలోని సెక్షన్ 29 రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ప్రశ్నపత్రంతో విద్యార్థులకు పరీక్ష నిర్వహించడం చట్ట విరుద్ధమని తేల్చి చెప్పింది. గత ప్రభుత్వం సపోర్టింగ్ ది ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్‌ఫార్మేషన్ ప్రోగ్రాం(సాల్ట్) పేరుతో తీసుకొచ్చిన ఈ విధానం చట్ట విరుద్ధమని హైకోర్టు కొట్టివేసింది.

- Advertisement -

ఉమ్మడి పరీక్షల నిర్వహణ విధానం కామన్ పేపర్, రోజులో రెండు పరీక్షలు, సీబీఏ నిర్ధేశిత టైం టేబుల్ వంటివి పదో తరగతి బోర్డు పరీక్షను పోలి ఉన్నాయని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ పరీక్షల నిర్వహణ కారణంగా విద్యార్థులు భయం, ఆందోళనకు గురవుతారని పేర్కొంది. ఈ మేరకు గత ప్రభుత్వం తీసుకొచ్చిన సీబీఏ విధానం, దాని అమలు కోసం జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రొసీడింగ్స్ చెల్లవని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వడ్డిబోయిన సుజాత తీర్పు ఇచ్చారు.

- Advertisement -

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు ఫార్మెటివ్, సమ్మెటివ్ పరీక్షలను ఉమ్మడి ప్రశ్నపత్రంతో నిర్వహించాలని, పరీక్ష నిర్వహణకు నిర్దిష్ఠ మొత్తాని చెల్లించాలని 2022 అక్టోబర్ 3న స్టేట్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఉత్తర్వులు ఇచ్చింది. ఇందులో భాగంగా సపోర్టింగ్ ద ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్‌ఫర్మేషన్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో 1 నుంచి 8 వ తరగతి వరకు చదివే విద్యార్థులకు సీబీఏ విధానాన్ని తప్పనిసరి చేసింది.

Also Read: ప్రభుత్వ శ్వేతపత్రం విడుదలతో వైసీపీలో కలవరం.. అంబటి అర్థంలేని ఎదురుదాడి

ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ యునైటెడ్ ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఫెడరేషన్ చైర్మన్, మరో విద్యా సంస్థ కార్యదర్శి 2022లో హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది మతుకుమిల్లి శ్రీ విజయ్.. 1 నుంచి 8 వరకు తరగతుల విద్యార్థులకు ఉమ్మడి పరీక్ష అనేది విద్యాహక్కు చట్ట నిబంధనలకు విరుద్ధమని వాదించింది. దీనికి న్యాయమూర్తి ఏకీభవించి పరీక్ష నిర్వహణను తప్పుబట్టారు. తీర్పును రిజర్వ్ చేసిన న్యాయమూర్తి తాజాగా, నిర్ణయాన్ని వెల్లడించారు.

ఫార్మెటివ్ పరీక్షలను గతంలో పాఠశాల స్థాయిలోనే జరిగేవి. ప్రతి పాఠశాలలో అందులో పనిచేస్తున్న ఉపాధ్యాయులే సబ్జెక్టుల వారీగా ఎగ్జామ్ పేపర్లను తయారుచేసి నిర్వహించే వారు. అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో సాల్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించి.. ఏడాదికి నాలుగు సార్లు జరగాల్సిన ఫార్మెటివ్ పరీక్షలు..రెండు సార్లు ఓఎంఆర్ షీట్‌తో సీబీఏగా నిర్వహిస్తుండగా.. మిగతా రెండింటికి ప్రశ్నపత్రాలను ఎన్‌సీఈఆర్టీ రూపొందించి పంపిస్తున్న సంగతి తెలిసిందే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News