Big Stories

NTR pension Bharosa: సీఎం ఎలా ఉండాలో నేను నిరూపిస్తా.. పెన్షనర్లతో ముఖాముఖిలో చంద్రబాబు

NTR pension Bharosa: ఏపీలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీకి సర్వం సిద్దమైంది. ఈ మేరకు ఉదయం 6 గంటల నుంచే సచివాలయ ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లి పింఛన్లను అందించనున్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 65.31 లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేయనున్నారు. పెరిగిన పింఛన్, బకాయిలు కలిపి ‘ఎన్టీఆర్ భరోసా’ పేరుతో ఇకపై ఇంటి వద్దనే సామాజిక పెన్షన్ల పంపిణీ చేయనున్నారు.మొత్తం 65.18 లక్షల మందికి పింఛన్ పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.4,408 కోట్లను విడుదల చేసింది.

- Advertisement -

తొలి పింఛన్ పంపిణీ చేసిన చంద్రబాబు
మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాకలో సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు పింఛన్ అందించారు. లబ్ధిదారులు ఇస్లావత్ సాయి, బనావత్ పాములు నాయక్, బనవత్ సీతలకు స్వయంగా పెన్షణ్ అందజేశారు. అనంతరం వాళ్లతో చంద్రబాబు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం.. పింఛన్ పెంపు తొలి నెల నుంచే అమలు చేశారు.

- Advertisement -

AP CM Chandrababu Starts NTR Bharosa Pension Scheme July 1st News

పెనుమాక పర్యటనలో భాగంగా చంద్రబాబు నేరుగా పింఛన్లు అందజేశారు. అనంతరం పెనుమాకలో పెన్షనర్లతో చంద్రబాబు ముఖాముఖిలో మాట్లాడారు. ప్రజల ఆశీస్సులతో నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యానని, చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్ర అప్పులు ఎన్ని ఉన్నాయో తెలియదని, ఐదేళ్లు ప్రజలను అణగదొక్కారని చెప్పారు.

అధికార యంత్రాంగం ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీశారని చంద్రబాబు పేర్కొన్నారు. వలంటీర్లు లేకపోతే పెన్షన్ రాద్దని బెదిరించారన్నారు. నా పాలనలో హడావిడి ఉండదని, ప్రజలతో మమేకం కావడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు. సీఎం ఎలా ఉండాలో నేను నిరూపిస్తా పేర్కొన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 28 విభాగాలకు చెందిన లబ్ధిదారులకు పెరిగిన పింఛన్‌ను అందజేయనున్నారు. పింఛన్ పెంపుతో పాటు పెండింగ్‌లో ఉన్న 3 నెలల పింఛన్ కూడా పంపిణీ చేయనున్నారు.పెరిగిన పింఛన్ రూ.4వేలు, గతమూడు నెలలకు సంబంధించిన నగదు రూ.3వేలు కలిపి రూ. 7వేలు అందించనుంది.

నేటి నుంచి పింఛన్లను పంపిణీ చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచార సమయంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రూ.7వేలు అందించనుంది. దీంతో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు లబ్ధి చేకూరనుంది. కూటమి ప్రభుత్వం చేపడుతున్న రూ.7వేల పింఛన్ కార్యక్రమం దేశ చరిత్రలోనే రికార్డుగా పరిగణిస్తున్నారు.

గుంటూరు జిల్లా పెనుమాకలో సీఎం చంద్రబాబు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు నేరుగా వెళ్లి ఆయనే పింఛన్లను అందించారు. మిగతా ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పంపిణీ చేస్తున్నారు. అలాగే గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి పింఛన్ అందిస్తున్నారు. అయితే ఇందులో పింఛన్‌తో పాటు చంద్రబాబు రాసిన లేఖను జత చేసి అందించినట్లు సమాచారం.

వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, మత్స్యకారులు, చేనేత, కల్లుగీత కార్మికులు, కళాకారులు, డప్పు కళాకారులు, ట్రాన్స్ జెండర్స్ కు వైసీపీ ప్రభుత్వం రూ.3వేలు చొప్పున పంపిణీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా, వీరికి ఒకే సారి రూ.1000 పెంచడంతో రూ.4వేలకు చేరింది. అంటే గత మూడు నెలలు పెండింగ్ లో ఉన్న రూ. 3 వేలు కలిపి మొత్తం రూ.7వేలు ఇవ్వనుంది.

దివ్యాంగులకు గత ప్రభుత్వం రూ.3వేలు అందించగా..ప్రస్తుతం రూ.6వేలకు పెంచింది. అలాగే దివ్యాంగుల్లో పూర్తి అంగవైకల్యం ఉన్న వారికి రూ.5వేల నుంచి రూ రూ.15 వేలకు పెరిగింది. తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న వారికి రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెరిగింది. ఈ కేటగిరి కింద మొత్తం 24,318 లబ్ధిదారులు ఉన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ల పంపిణీని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ మేరకు ఉదయం 6 గంటల నుంచే సచివాలయ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి అందిస్తున్నారు. మొదటి రోజే వంద శాతం పూర్తి చేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఒక్కో సచివాలయ ఉద్యోగికి 50 మందిని కేటాయించారు. కొన్ని కారణాలతో పింఛన్ అందుకోని సమక్షంలో రెండో రోజు అందజేస్తారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News