Big Stories

Botsa Satyanarayana: ఏపీలో జరుగుతున్న పరిణామాలు బాధాకరం: బొత్స సత్యనారాయణ

Botsa Satyanarayana latest news(AP political news): అధికారంలో ఉన్న వారు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విజయనగరంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో గత 20 రోజులుగా జరుగుతున్న పరిణామాలు బాధాకరంగా ఉన్నాయన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ కూల్చివేతపై ఆయన స్పందించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి పరిణామాలు జరగకూడదని అన్నారు.

- Advertisement -

తమ ప్రభుత్వ హయాంలో గతంలోనూ దాడులు జరిగాయని తెలిపారు. ప్రతిపక్షాలకు చెందిన పార్టీ కార్యాలయాలు, నాయకులపై దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా పార్టీ కార్యాలయాల్లోకి అధికార పార్టీ ఎమ్మెల్యేలు వెళ్లి పరిశీలించడం సరికాదని తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో పొరపాట్లు జరిగితే నోటీసులు ఇవ్వాలి కానీ దాడులు చేయడం ఏంటని ప్రశ్నించారు. వర్సిటీల్లో వీసీలను తొలగించాలని దౌర్జన్యాలకు దిగటం తప్పని అన్నారు.

- Advertisement -

గత ప్రభుత్వంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయన్నారు. అప్పుడు తమ పార్టీ నేతలు చేసిన తప్పుల్ని సమర్థించ లేదని తెలిపారు. విద్యాశాఖలో తనపై వచ్చిన ఆరోపణలు సరికాదన్నారు. అందుకు సంబంధించిన డాక్యెమెంట్స్ తన దగ్గర ఉన్నాయని వెల్లడించారు. అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడకుండా అందరు రిటైర్ అయ్యాక మాట్లాడుతున్నారని తెలిపారు. అది ఎంత వరకు సమంజసం అని మండిపడ్డారు.

రాష్ట్ర ఆర్థిక పురోగతి టీడీపీకి వాళ్ళకి తెలుసు. పథకాలు ఇస్తారో ఇవ్వరో కూడా వాళ్ళకే తెలియాలి.రిటైర్మెంట్ కలుపుకొని చాలా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. 117 జీవోను రద్దు చేస్తే ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిని బట్టి ఉద్యోగాలు భర్తీ చేయవచ్చని తెలిపారు.

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News