Big Stories

AP EDCET 2024: ఏపీ ఎడ్‌సెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..!

AP EDCET 2024 Results: ఏపీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ఫలితాలు విడుదలయ్యాయి. గురువారం ఉన్నతాధికారులు ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్రంలో టీచర్స్ ట్రైనింగ్ కోర్సులు బీఈడీ, స్పెషల్ బీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్షను నిర్వహించారు. ఏపీ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి తరుపున విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఎడ్‌సెట్ నోటిఫికేషన్ ఏప్రిల్ 16న విడుదల చేశారు.

- Advertisement -

ఏప్రిల్ 18 నుంచి మే 15 వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగింది. ఏపీ ఎడ్‌సెట్ పరీక్ష జూన్ 8న నిర్వహించగా గురువారం ఫలితాలు విడుదల చేశారు. అభ్యర్థులు ఫలితాల కోసం https://cets.apsche.ap.gov.in/EDCET/Edect/EDCET-Get Result.aspx లో చెక్ చేసుకోవచ్చు.

- Advertisement -

ఏపీ ఎడ్‌సెట్ పరీక్ష జూన్ 8న జరిగింది. మొత్తం 9,365 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు.ఈ పరీక్షకు సంబంధించిన ప్రిలిమినరీ కీ జూన్ 15న విడుదల చేశారు. ఆన్సర్ కీ డౌన్‌లోడ్ చేసుకున్నఅభ్యర్థులు తమ అభ్యంతరాలను తెలిపేందుకు 3 రోజుల సమయం ఇచ్చారు. జూన్ 18 వరకు అభ్యంతరాలు తెలిపేందుకు గడువు ఇచ్చారు. ఏపీ ఎడ్‌సెట్‌కు సంబంధించిన ఫలితాలను ఆంధ్ర యూనివర్సిటీ ప్రకటించింది. ఎడ్‌సెట్ ఫలితాలు, స్కోర్ కార్డును అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Also Read: ఏపీ ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి!

ఫలితాలను ఎలా చూడాలి..?
అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్‌ను క్లిక్ చేయాలి. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ నంబర్, ఎడ్‌సెట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత వ్యూ రిజల్స్ట్ పై క్లిక్ చేస్తే ఫలితాలు చూసుకోవచ్చు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News