Big Stories

AP Deputy CM Pawan Kalyan: రూ.600 కోట్లతో రుషికొండలో ప్యాలెస్.. ఆ నిధులతో ఓ జిల్లా అభివృద్ధి జరిగేది.. పవన్ వ్యాఖ్యలు

AP Deputy CM Pawan Kalyan: రూ.600 కోట్లతో రుషికొండలో ప్యాలెస్ కట్టుకున్నారని మాజీ సీఎం జగన్‌పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆరోపించారు. కాకినాడ జిల్లి గొల్లప్రోలులో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ .. రుషికొండలో ప్యాలెస్ కట్టుకున్న నిధులను ఇక్కడ ఉపయోగిస్తే.. జిల్లా అభివృద్ధి జరిగేదన్నారు. అనంతరం లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ చేశారు.

- Advertisement -

గత ప్రభుత్వంలో అవినీతి దారుణంగా చేశారని, పంచాయతీ నిధులు ఎటు వెళ్లాయే తెలియడం లేదన్నారు. అయితే పవన్ కల్యాణ్ వైపు నుంచి ఎలాంటి అవినీతి ఉండదన్నారు. పర్యావరణ శాఖను బలోపేతం చేస్తామన్నారు. అలాగే పర్యావరణ కాలుష్యంపై జవాబుదారీతనం తీసుకొస్తామని వెల్లడించారు. గోదావరి పారుతున్నా తాగునీటికి ఇబ్బందులున్నాయని పవన్ కల్యాణ్ తెలిపారు. గతంలో జల్ జీవన్ మిషన్ నిధులున్న ఉపయోగించలేదని, కనీసం మ్యాచింగ్ గ్రాంట్లు కూడా ఇవ్వలేదన్నారు.

- Advertisement -

భారీ మెజార్టీతో గెలిపించిన పిఠాపురం ప్రజలకు రుణపడి ఉంటానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. శాఖలపై అధ్యయనానికి కొంత సమయం తీసుకున్నట్లు వెల్లడించారు. తక్కువ చెప్పి ఎక్కువ పని చేయాలని అనుకుంటున్నట్లు తన మనసులో ఉన్న మాటలను ప్రజలకు చెప్పారు. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్లు పెంచి ఇచ్చామే తప్పా తగ్గించలేదన్నారు. రాష్ట్రానికి సంక్షేమంతో పాటు అభివృద్ధి కావాలన్నారు.

పిఠాపురాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనేది నా ఆకాంక్ష అని పవన్ కల్యాణ్ అన్నారు. నేను రాజకీయాల్లోకి వచ్చింది డబ్బులు వెనకేసుకోవడానికి కాదని, ప్రజల్లో నాకు సుస్థిర స్థానం కావాలన్నారు. అన్ని పనులు చిటికెలో కావు.. కానీ అయ్యేలా పనిచేస్తామన్నారు. ఇక, పింఛన్ అర్హత ఉన్న అందరికీ వస్తుందని, పార్టీకి ఓటు వేయకపోయినా వస్తుందని చెప్పారు.

గతంలో పింఛన్ రూ.3000 ఇచ్చేందుకు రూ.300 కమీషన్ తీసుకునే వాళ్లని ఆరోపించారు. కానీ కూటమి ప్రభుత్వం అలా చేయదని భరోసా ఇచ్చారు. వాలంటీర్లు లేకపోతే పెన్షన్ పంపిణీ చేయడం సాధ్యం కాదన్నారు. ప్రభుత్వం సిబ్బందితోనే పంపిణీ చేస్తున్నట్లు పవన్ చెప్పారు.

Also Read: ఏపీలో మరో ఎన్నికకు రంగం సిద్ధం.. టీడీపీకి కొత్త టెన్షన్

గత ప్రభుత్వం చేసిన నిర్వాకంతో ప్రభుత్వ వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని, ప్రస్తుం వాటిని గాడిలో పెడుతున్నామని పవన్ అన్నారు. రానున్న ఐదు ఏళ్లల్లో రక్షిత మంచినీటి పథకం లేని గ్రామం ఉండకుండా చేయాలన్నదే లక్ష్యమన్నారు. అలాగే గిరిజన మారుమూల ప్రాంతాల్లో అనారోగ్యం బారినపడిన వారిని డోలుపై మోసుకొని రాకుండా సౌకర్యాలు కల్పించాలని ఉందన్నారు. ఇక, పిఠాపురంలో సొంత ఇళ్లు కట్టుకుంటానని, ప్రస్తుతం ఇల్లు నిర్మించుకునేందుకు స్థలం కోసం వెతుకుతున్నట్లు పవన్ కల్యాణ్ తెలిపారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News