Big Stories

NTR Bharosa : ఏపీలో మారిన పెన్షన్ స్కీం.. “ఎన్టీఆర్ భరోసా” పునరుద్ధరణ.. జులై 1న రూ.7 వేలు

NTR Bharosa Pension Scheme(Latest news in Andhra Pradesh): ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబునాయుడు.. పింఛన్ దారులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం.. రూ.3 వేలుగా ఉన్న పెన్షన్ ను రూ.4 వేలు చేస్తూ.. ఏపీ సీఎస్ నీరభ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. సాధారణ పెన్షన్ గా ఉన్న పేరును మళ్లీ ఎన్టీఆర్ భరోసాగా పునరుద్ధరించారు. నిన్న సచివాలయంలోని తన ఛాంబర్ లో ఐదు ఫైళ్లపై సంతకం చేసిన సీఎం.. మూడో సంతంకం పింఛన్ల పెంపు ఫైల్ పై చేశారు. 2014-19 మధ్య పెన్షన్ స్కీం కు పెట్టిన పేరునే కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

వృద్దులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, మత్స్య, చర్మ కారులు, డప్పు కళాకారులు, కల్లుగీత కార్మికులు, హిజ్రాలు, హెచ్ఐవీ బాధితులకు ఇక నుంచి నెలకు రూ.4 వేల పెన్షన్ ను అందించనుంది ప్రభుత్వం. పెంచిన పెన్షన్ స్కీం ను ఏప్రిల్ నుంచే అమలు చేయనుండగా.. జులై 1న పెన్షన్ దారులు రూ.7 వేలు అందుకోనున్నారు. ఏప్రిల్ నుంచి 3 నెలలపాటు ఒక్కో నెలకు రూ.1000 చొప్పున, జులై నెల రూ.4 వేలు పెన్షన్ కలిపి.. రూ.7 వేలు పెన్షన్ దారులు పొందనున్నారు. పెన్షన్ పెరగడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

రాష్ట్రంలో ఉన్న 65.39 లక్షల మంది పెన్షన్ దారులకు పెన్షన్లు ఇచ్చేందుకు ప్రతి నెలా రూ.1939 కోట్లు ఖర్చవుతోంది. పెంచిన పెన్షన్ ను ఏప్రిల్ నుంచి అమలు చేయడంతో.. రూ.1650 కోట్లు కలిపి.. ఒక్క జులై నెలకు రూ.4408 కోట్లు ఖర్చవుతుంది. ఆగస్టు నుంచి నెలకు రూ.2758 కోట్లు.. ఏడాదికి రూ.33,099 కోట్లు ఖర్చు కానుందని ప్రభుత్వ అధికారులు అంచనా వేశారు.

కాగా.. ఈ పెన్షన్ స్కీం లో దివ్యాంగులకు లబ్ధి చేకూరనుంది. ఇప్పటి వరకూ వారి పెన్షన్ రూ.3 వేలు ఉండగా.. జులై 1 నుంచి రూ.6 వేలు అందనుంది. అలాగే అస్వస్థతకు గురైనవారికి, మంచాన పడినవారికి, వీల్ ఛైర్ కు పరిమితమైనవారికి రూ.5 వేల నుంచి రూ.15 వేలకు పెన్షన్ ను పెంచారు. అదేవిధంగా.. కిడ్నీ, లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకున్నవారిక డయాలసిస్ స్టేజ్ లో ఉన్న కిడ్నీ పేషంట్లకు రూ. 15 వేల పెన్షన్ ను అందించనుంది ప్రభుత్వం.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News