Big Stories

Another shock to IAS SriLaxmi: శ్రీలక్ష్మికి మరో షాక్, సంతకం పెట్టని మంత్రి

Another shock to IAS SriLaxmi: ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి మరో షాక్ తగిలింది. ప్రస్తుతం పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్‌గా ఉన్నారామె. ఆదివారం ఆ శాఖ మంత్రిగా నారాయణ సచివాలయం లో బాధ్యతలు చేపట్టారు. ఆ సందర్భంగా సంతకాల కోసం శ్రీలక్ష్మి ఓ ఫైల్ తెచ్చారు. దానిపై సంతకం పెట్టడానికి మంత్రి నారాయణ నిరాకరించారు. దీంతో ఆమె సైలెంట్ అయి.. ముఖం చిన్న బుచ్చుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు.

- Advertisement -

ఈ సన్నివేశాన్ని చూస్తూ ఉండిపోయారు తోటి ఉద్యోగులు. ఇదేకాదు సీఎం చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన రోజు ఆయన ఛాంబర్‌కి డైరెక్ట్‌గా వెళ్లిపోయారు. సీఎం కాసింత కోపంగా చూడడంతో ఆమెని అక్కడి నుంచి పంపించేశారు సీఎస్. హాలులో ఉండాలని చెప్పడంతో శ్రీలక్ష్మి వెళ్లిపోయారు.

- Advertisement -

2019 ఎన్నికల ఫలితాలు తర్వాత తెలంగాణ నుంచి ఏపీకి డిప్యుటేషన్‌పై ఆమెని రప్పించారు జగన్. ఐదేళ్ల పాటు ఆమెకి తిరుగులేకుండా పోయింది. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది. ఫలితాల రోజు ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లిపోవాలని భావించారు. అందుకు అప్పటి సీఎస్ జవహర్‌రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈలోగా గవర్నర్ నుంచి ఆదేశాలు రావడంతో ఆమె ఉండిపోయారు.

ALSO READ: రాజీనామాల పర్వం, దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి కరికాల రిజైన్

శ్రీలక్ష్మి బదిలీ అయ్యేవరకు ఆమె తీసుకొచ్చిన ఫైళ్లపై సంతకాలు పెట్టకూడదని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మైనింగ్ కేసులో ఇప్పుడిప్పుడే రిలాక్స్ అవుతున్న సమయంలో డిప్యుటేషన్‌పై ఏపీకి రావడం, ఇక్కడ చేదు అనుభవం ఎదురుకావడం ఆమెకి ఊహించని పరిణామం.

కేంద్రం, తెలంగాణ నుంచి డిప్యుటేషన్‌పై వచ్చిన అధికారులను ఇప్పటివరకు ఏపీ ప్రభుత్వం రిలీవ్ చేయలేదు. ఐదేళ్లలో వారు పని చేసిన శాఖలను మొత్తమంతా పరిశీలించిన తర్వాత పంపాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్లు వార్తలు జోరందుకున్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News