Big Stories

AP Liquor Scam : జగన్ అండ్ కో లిక్కర్ స్కామ్.. శరత్ చంద్రారెడ్డి సంస్థతో లింకులు ?

Andhra Pradesh Liquor Scam news(AP breaking news today): ప్రజలకు చాలా మంచి చేశాం. ఎన్నో సంక్షేమాలు అందించాం. విద్యా వ్యవస్థను అభివృద్ధి చేశాం. కానీ.. వాళ్లందరి ఓట్లు ఏమయ్యాయో.. ఎందుకు ఓడిపోయామో తెలియడం లేదు.. అంతా ఆ దేవుడికే తెలియాలి. ఈ కామెంట్లు ఇప్పటికే ఏపీ మాజీ సీఎం జగన్ రెండుసార్లు చేశారు. కానీ.. ప్రజలు తమకు యాంటీగా ఉన్నారని, అందుకే ఓడిపోయామన్న నిజాన్ని మాత్రం అంగీకరించడం లేదు. ప్రభుత్వం మారింది. గత ప్రభుత్వం చేసిన స్కామ్ లు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. ఆడుదాం ఆంధ్ర పేరుతో.. వైసీపీ ఫైర్ బ్రాండ్ మాజీమంత్రి రోజా రూ.100 కోట్లు కాజేశారన్న ఆరోపణలొచ్చాయి. ఇందులో శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి హస్తం కూడా ఉందని ఆత్యా-పాత్యా సంఘం సీఈఓ ప్రసాద్ సీఐడీకి ఫిర్యాదు చేశారు.

- Advertisement -

తాజాగా తెరపైకి ఏపీ మద్యం కుంభకోణం వచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్టైన శరత్ చంద్రారెడ్డికి సంబంధించిన సంస్థతో.. ఏపీ లిక్కర్ స్కామ్ లో భాగమైన డిస్టిలరీస్ కు లింకులున్నాయని సమాచారం. 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే దశలవారీగా మద్యపాన నిషేధం చేస్తామని చెప్పిన జగన్ సర్కార్.. మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహించింది. ఈ ముసుగులో జగన్ అండ్ కో.. భారీ మద్యం కుంభకోణానికి తెరలేపింది. మద్యం తయారీ నుంచి.. కొనుగోళ్లు, సరఫరా, విక్రయాలు ఇలా అన్నింటా ఐదేళ్లలో భారీగా దోచేసుకుంది. వేలకోట్ల రూపాయాల విలువైన ఈ కుంభకోణం.. మెయిన్ రోల్ జగన్ మోహన్ రెడ్డి కాగా.. ఆయనతో పాటు ఎంపీలు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి ఉన్నారన్న ఆరోపణలున్నాయి. వాళ్ల బినామీల పేర్లతో ఉన్న కంపెనీలకే ఐదేళ్లలో రూ.10 వేలకోట్ల విలువైన మద్యం ఆర్డర్లు దక్కడమే ఇందుకు సాక్ష్యం.

- Advertisement -

Also Read : జగన్ వ్యూహాత్మక తప్పిదం.. వైసీపీ నుంచి బీసీలు అవుట్!

వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక.. కొత్త మద్యం విధానం పేరుతో.. డిస్టిలరీలు, బ్రూవరీస్ ను చేజిక్కించుకుని.. జే బ్రాండ్లను తయారు చేయించి.. జనంపైకి వదిలారు. వీటిలో కేసుకు అడిగినంత కమీషన్ చెల్లించినవారికే మద్యం సరఫరా ఆర్డర్లిచ్చారు. గతంలో ఉన్న బ్రాండ్లేవీ లేకుండా జే బ్రాండ్లనే అమ్మారు. జనాల ఆరోగ్యంతో చెలగాటమాడారు. అయితే.. ఈ మద్యం కుంభకోణమంతా ఎంపీ మిథున్ రెడ్డి కనుసన్నల్లోనే జరిగిందన్న ఆరోపణలు లేకపోలేదు. ఆర్డర్ల నుంచి వచ్చిన కమీషన్లను బాస్ కు అందించడంలో.. ఐటీ సలహాదారుగా పనిచేసిన కసిరెడ్డి హస్తం ఉందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.

ఏపీలో అతిపెద్ద డిస్టిలరీల్లో ఒకటిగా ఉన్న నంద్యాల ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ ను ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అనధికారికంగా తన గుప్పిట్లోకి తెచ్చుకున్నారు. కృష్ణాజిల్లాలో ఉన్న సెంటినీ బయోప్రొడక్ట్స్ డిస్టిలరీలలో జే బ్రాండ్లను తయారు చేయించి సరఫరా చేశారు. 2019 అక్టోబర్ 2 నుంచి 2021 నవంబర్ మధ్యలోనే ఏకంగా రూ.1863 కోట్ల విలువైన 1.16 కోట్ల కేసుల మద్యం సరఫరా ఆర్డర్లను SPY ఆగ్రో ఇండస్ట్రీస్ కు అప్పగించింది.

విజయసాయిరెడ్డి విషయానికొస్తే.. అల్లుడి బినామీ పేరుతో కంపెనీ పెట్టి.. భారీగా దోచుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 2019 డిసెంబర్ 2న హైదరాబాద్ లో అదాన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పుట్టుకొచ్చింది. సొంతంగా ఒక్క డిస్టిలరీ లేకపోయినా.. విశాఖ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, పీఎంకే డిస్టిలేషన్ ప్రైవేట్ లిమిటెడ్, ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ ను సబ్ లీజు పేరిట అనధికారికంగా ఆధీనంలోకి తీసుకున్నారు. జే బ్రాండ్లను అక్కడే తయారు చేసి వదిలారు. గడిచిన నాలుగున్నరేళ్లలో రూ.4 వేల కోట్ల విలువైన సరఫరా ఆర్డర్లు దక్కినట్లు సమాచారం. ఇది అనధికారికం.

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News