Big Stories

AP Assembly Sessions: ఏపీ అసెంబ్లీ సమావేశాల తేదీలు ఖరారు.. ఎప్పట్నుంచంటే..?

Andhra Pradesh Assembly Sessions: ఏపీలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 21 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. రెండురోజులపాటు ఈ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సెషన్ లో ఇటీవల ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారంతోపాటుగా స్పీకర్ ఎన్నిక ఉంటుంది. అయితే, వాస్తవానికి ఈ నెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావించినట్లు ప్రచారం జరిగింది. తాజాగా తేదీల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే తొలిరోజునే.. అంటే ఈ నెల 21న ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఉండనున్నది. ఆ మరుసటి రోజున 22న స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉండనున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

కాగా, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గా చింతకాయల అయ్యన్నపాత్రుడికి అవకాశం ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులు జనసేనకు ఇవ్వనున్నారని తెలుస్తోంది. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ప్రొటెం స్పీకర్ గా మరో సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యవహరించనున్నట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేల హాజరుపై ఉత్కంఠ నెలకొన్నది. ఈ నెల 22న వైసీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో జగన్ హాజరుకానున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు.

- Advertisement -

Also Read: జగన్ పథకాలకు పేర్లు మార్పు.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ..

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం అసెంబ్లీలో వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కే అవకాశం లేదు. ఎందుకంటే ఆ హోదా దక్కాలంటే.. మొత్తం సీట్లలో 10 శాతం సీట్లు గెలవాల్సి ఉంటుంది. కనీసం 18 సీట్లలోనైనా గెలిచి ఉండాలి. కానీ.. వైసీపీ మాత్రం కేవలం 11 సీట్లలో విజయం సాధించింది. అందువల్ల ఇప్పుడు అధికారంలో భాగంగా ఉన్నటువంటి జనసేన పార్టీనే ప్రతిపక్ష హోదా కూడా పొందినట్లు అయ్యింది. తక్కువ సంఖ్యలో వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నందున అసెంబ్లీ సమావేశాల సమయంలో మాట్లాడేందుకు ఎక్కువ టైం లభించకపోవొచ్చు అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News