EPAPER

BRS: కేసీఆర్‌తో కటీఫ్!.. బరిలోకి మజ్లిస్.. కారుకు కంగారేనా?

BRS: కేసీఆర్‌తో కటీఫ్!.. బరిలోకి మజ్లిస్.. కారుకు కంగారేనా?
kcr mim

MIM vs BRS party latest news(Telangana politics): ఎన్నికలకు ముందు తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయా? అధికార BRSతో MIMకి దోస్తీ చెడిందా? హైదరాబాద్‌లో పాతబస్తీకే పరిమితమైన MIM… 50 స్థానాల్లో బరిలోకి దిగబోతోందా? హైదరాబాద్ బయట ఆ పార్టీ సత్తా చాటగలదా? MIM ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తే ఏ పార్టీకి లాభం?


తెలంగాణలో బిఆర్ఎస్ కు, ఎం.ఐ.ఎం కు మధ్య దూరం పెరిగినట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ కు… స్థానిక ఎం.ఐ.ఎం పార్టీకి చెందిన నేతల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఎం.ఐ.ఎం కార్యకర్తలపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. వారిని ఓవైసీ పరామర్శించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో మెజారిటీ స్థానాల్లో పోటీ చేస్తామని, ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తామన్న విషయంపై ఎన్నికల ముందు అభ్యర్థులను ప్రకటిస్తామని అన్నారు. వచ్చే ఎన్నికల్లో భోదన్ లో ఎం.ఐ.ఎం పోటీ చేస్తుందని చెప్పారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ కు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తామని అన్నారు. అరెస్టు అయిన ఎం.ఐ.ఎం కార్యకర్తలంతా గత ఎన్నికల్లో కవిత, షకీల్ గెలుపు కోసం పని చేశారంటున్నారు.

ఎం.ఐ.ఎం ఇప్పటి వరకు హైదరాబాద్ నగరంలోని పాతబస్తీకి పరిమితమైన పార్టీ. ఓల్డ్ సిటీలో తిరుగులేని విజయాలు సాధిస్తోంది. అక్కడి ఏడు ఎమ్మెల్యే స్థానాల్లో మజ్లిస్ దే గెలుపు. రాష్ట్రవ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో ముస్లింల ప్రాబల్యం ఉన్నా.. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి మద్దతు ఇస్తూ కేవలం పాతబస్తీలో మాత్రమే పోటీ చేస్తూ వస్తోంది ఓవైసీ పార్టీ.


ఇక 2019 లోక్ సభ ఎన్నికల్లో కేవలం హైదరాబాద్ పార్లమెంట్ స్థానానికి మాత్రమే పరిమితమైంది. మరెక్కడా పోటీ చేయలేదు. అటు బీఆర్ఎస్ కూడా హైదరాబాద్ స్థానానికి దూరం పాటించింది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికలు, ఉప ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ పోటీ చేసింది. బిహార్, మహారాష్ట్ర వంటి చోట్ల ఖాతాలు తెరిచి సత్తా చాటింది. తెలంగాణ ఎన్నికలు మరో 5 నెలల్లో జరగనుండటంతో ఎంఐఎం ఈసారి కాస్త గట్టిగానే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటోంది. ఎం.ఐ.ఎం. శాసనసభపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ తెలంగాణ అసెంబ్లీలో గతంలో చేసిన ప్రకటన రాజకీయాల్లో చర్చకు దారి తీసింది. వచ్చే ఎన్నికల్లో ఎం.ఐ.ఎం. రాష్ట్ర వ్యాప్తంగా 50 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుందన్నారు. 15 చోట్ల గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెడుతామంటున్నారు. ఎం.ఐ.ఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అసెంబ్లీలో సిఎం కెసిఆర్ ను కలిశారు. వచ్చే ఎన్నికల్లో 50 స్థానాల్లో పోటీ చేయడంపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఇప్పుడు మరోసారి ఆ విషయాన్ని టచ్ చేశారు.

దేశ వ్యాప్తంగా ముస్లింలు ఎక్కువ సంఖ్యలో ఉన్న రాష్ట్రాల్లో ఎం.ఐ.ఎం పోటీ చేయడం ద్వారా.. అక్కడి ప్రతిపక్ష పార్టీల ఓట్లను చీల్చడం ద్వారా.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కమలం పార్టీకి లబ్ది చేకూరుస్తోందని కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలు ఎం.ఐ.ఎం పై విమర్శలు చేస్తూ వచ్చాయి. మరోవైపు తమ పార్టీని దేశ వ్యాప్తంగా విస్తరించేందుకు ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ఎం.ఐ.ఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చెప్తూ వస్తున్నారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎం.ఐ.ఎం తెలంగాణలో 50 స్థానాల్లో పోటీ చేస్తే రాజకీయ సమీకరణాలు తారుమారు అయ్యే అవకాశం ఉందా అన్న చర్చ జరుగుతోంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పాటుగా ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ, మహబూబ్ నగర్, మెదక్ జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో ముస్లింల ఓట్లు కీలకంగా ఉంటాయి. దీంతో ఎం.ఐ.ఎం అభ్యర్థులు పోటీ చేస్తే ఇతర పార్టీల అభ్యర్థుల గెలుపోటములపై ఎఫెక్ట్ పడుతుందంటున్నారు. ముఖ్యంగా గత రెండు ఎన్నికల్లో హైదరాబాద్ ఓల్డ్ సిటీ బయట ఎం.ఐ.ఎం అధికార బిఆర్ఎస్ కు మద్దతు ఇవ్వడంతో బిఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు.

50 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని ఎం.ఐ.ఎం నిర్ణయం తీసుకుంటే బిఆర్ఎస్ అభ్యర్థులకు అక్కడ గట్టి పోటీ తప్పదన్న చర్చ జరుగుతోంది. అదే సమయంలో ఆ 50 చోట్ల తమకే బెనిఫిట్ అని బీజేపీ లెక్కలేసుకుంటోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. వచ్చే ఎన్నికల్లో ఎం.ఐ.ఎం 50 స్థానాల్లో కాదు 119 స్థానాల్లో పోటీ చేయాలని సవాల్ విసిరారు.

గత రెండు పర్యాయాలుగా అధికార బిఆర్ఎస్ పార్టీతో, సీఎం కేసీఆర్ కు సన్నిహితంగా ఉంటూ వస్తున్న ఎం.ఐ.ఎం కు బిఆర్ఎస్ పూర్తి సహాయ సహకారాలు అందిస్తోంది. రెండు ఎమ్మెల్సీ స్థానాలను ఎం.ఐ.ఎం కు కేటాయించింది. ఎమ్మెల్యేల కోటాలో ఒక స్థానాన్ని ఇవ్వగా మరో స్థానాన్ని హైదరాబాద్ స్థానిక సంస్ధల కోటాలో కేటాయించింది. సీఎం కేసీఆర్ తో ఒవైసీ బ్రదర్స్ కు ఉన్న సాన్నిహిత్యంతో ఆ పార్టీ 50 స్థానాల్లో పోటీ చేస్తుందా లేక బిఆర్ఎస్ ను తన దారికి తెచ్చుకునేందుకు అక్బరుద్దీన్ ఓవైసీ ఈ రకమైన వ్యాఖ్యలు చేశారా అనే చర్చ జరుగుతోంది. ఒక వేళ ఎం.ఐ.ఎం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 50 స్థానాల్లో పోటీ చేస్తే అధికార బిఆర్ఎస్ ఎలాంటి వ్యూహాలు అనుసరించబోతుందన్నది కూడా కీలకమే.

రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే వారికి మద్దతు తెలిపే ఎం.ఐ.ఎం పార్టీ.. గత రెండు ఎన్నికల్లో అధికార బిఆర్ఎస్కు సపోర్ట్ ఇచ్చింది. అసెంబ్లీ సమావేశాల్లోను బయట బిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎం.ఐ.ఎం వ్యాఖ్యలు చేసినప్పటికీ బిఆర్ఎస్ తో అవగాహనతో రాజకీయం కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు ఎం.ఐ.ఎం – బిఆర్ఎస్ కు మధ్య దూరం పెరిగిందన్న ప్రచారం నేపథ్యంలో అసదుద్దీన్ వ్యాఖ్యలు కీలకంగా మారాయి. మరి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎం.ఐ.ఎం పార్టీ మెజారిటీ స్థానాల్లో పోటీ చేస్తుందా లేక బిఆర్ఎస్ పార్టీతో సర్దుకుపోతుందా అనేది చూడాలి.

Related News

Tirumala Laddu Politics: లడ్డూ కాంట్రవర్సీ.. దేవదేవుడి ప్రసాదంపైనే ఇన్ని రాజకీయాలా ?

Ys jagan vs Balineni: బాంబ్ పేల్చిన బాలినేని.. జగన్ పతనం ఖాయం

Israel Hezbollah War: యుద్ధంలో నయా వెపన్.. ఇక ఊచకోతే

YCP Leaders to Join in Janasena : గేట్లు తెరిచిన పవన్.. వైసీపీ ఖాళీ?

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Big Stories

×