EPAPER

Mudragada : కాకినాడ, పిఠాపురం.. ఎనీ సెంటర్.. పోటీకి రెడీనా?

Mudragada : కాకినాడ, పిఠాపురం.. ఎనీ సెంటర్.. పోటీకి రెడీనా?

Mudragada Padmanabham latest news(AP politics): జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పై కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం మరో లేఖాస్త్రం సంధించారు. ఇటీవల పవన్ కు ముద్రగడ లేఖ రాయడంతో ..జనసైనికులు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. దీనిపై ముద్రగడ మళ్లీ అదే రేంజ్ రీకౌంటర్ ఇచ్చారు. పవన్ తన ఫ్యాన్స్ తో బండ బూతులు తిట్టిస్తున్నారని, మెస్సేజ్‌లు పెట్టిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి విమర్శలకు లొంగిపోయే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. పవన్ సినిమాలో హీరో తప్పా.. రాజకీయాల్లో కాదని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. తనను తిట్టాల్సిన అవసరం ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. తాను జనసేనాని వద్ద నౌకరిగా పనిచేయడం లేదని.. తిట్టించాల్సిన అవసరం ఏంటి? అని ముద్రగడ నిలదీశారు.


ముద్రగడ తన లేఖలో పవన్ కు 12 ప్రశ్నలు సంధించారు. కాకినాడ నుంచి పోటీ చేయడానికి నిర్ణయం తీసుకోవాలని సవాల్ చేశారు. ఒకవేళ అక్కడ పోటీకి భయపడితే.. పిఠాపురం నుంచి పోటీ చేయాలని ఛాలెంజ్ చేశారు. అక్కడ తాను బరిలోకి దిగుతానని స్పష్టంచేశారు. చేగువేరా ఆదర్శం, గుండెలు నిండా ధైర్యం ఉందని చెప్పే పవన్ కల్యాణ్ పౌరుషం ఉందని భావిస్తున్నానని ముద్రగడ లేఖలో పేర్కొన్నారు. తనను తిట్టి యుద్ధానికి రెడీ అవ్వాలనే వాతావరణం కల్పించినందుకు సంతోషమన్నారు. గోచి మొలతాడు లేని వారితో తనను తిట్టిస్తున్నారని దమ్ముంటే పవనే తనపై విమర్శలు చేయాలన్నారు.

వంగవీటి హత్య, తుని ఘటన తర్వాత అమాయకులను జైలులో పెట్టారని ముద్రగడ అన్నారు. వారిని ఏనాడైనా పరామర్శించారా అని పవన్ ను ప్రశ్నించారు. కనీసం వారి కుటుంబాలను కలిసి ధైర్యం చెప్పారా? అని నిలదీశారు. ఇలా ముద్రగడ లేఖలు విడుదల చేస్తూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నా జనసేనాని సహనంతోనే వ్యవహరిస్తున్నారు. ముద్రగడపై కామెంట్స్ చేయడంలేదు. వైసీపీ నేతలను టార్గెట్ చేస్తూనే వారాహి యాత్ర సాగిస్తున్నారు. ముద్రగడకు జనసైనికులే కౌంటర్ ఇస్తున్నారు. మరి రెండో లేఖపైనైనా పవన్ స్పందిస్తారా..? ముద్రగడ ప్రశ్నలకు సమాధానం చెబుతారా..? ఆయన విసిరి సవాల్ ను స్వీకరిస్తారా..?


Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×